సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

Published : Nov 01, 2017, 05:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

సారాంశం

ఏపీ సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చంద్రబాబుని కలవనీయలేదని మనస్థాపం చెందిన యువకుడు

ఏపీ సచివాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. తన అభిమాన నాయకుడిని కలవనీయలేదనే బాధతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అసలేం జరిగిందంటే.. కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన ఓ యువకుడు  బుధవారం అమరావతిలోని సచివాలయం వద్దకు వచ్చాడు. సీఎం చంద్రబాబుని కలవాలని.. అందుకు తనకు అవకాశం కల్పించాలని కోరాడు. ప్రస్తుతం చంద్రబాబు మీటింగ్ లో ఉన్నారని.. కలవడానికి కుదరదని అక్కడి సిబ్బంది చెప్పారు. లోపలికి వెళ్తున్న  ఆయనను  సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు.. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన సిబ్బంది ఆ యువకుడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !