చంద్రబాబు రెడ్ కార్పెట్ వేస్తారా

Published : Nov 25, 2016, 01:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
చంద్రబాబు  రెడ్ కార్పెట్ వేస్తారా

సారాంశం

చంద్రబాబు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళడిగిన డిమాండ్లకు అంగీకరిస్తారని ఎవరూ అనుకోలేదు.

‘రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటే’ అన్నట్లుగానే సిఎం, వైసీపీ ఎంఎల్ఏల సమావేశం ముగిసింది. వైసీపీ శాసనసభ్యులు చంద్రబాబును కలుస్తున్నారనగానే సమావేశం ఎలా ముగుస్తుందో ఊహించిందే. లేకుంటే వైసీపీ ఎంఎల్ఏలు వెళ్ళగానే చంద్రబాబు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళడిగిన డిమాండ్లకు అంగీకరిస్తారని ఎవరూ అనుకోలేదు.

 

అందులోనూ ప్రతిపక్ష ఎంఎల్ఏలు అడిగింది కూడా మామూలు కోరికలు కాదు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని. తమ ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో టిడిపి ఇన్ చార్జిల పేరుతోనే నిధులు మంజూరవుతున్నట్లు ఫిర్యాదు చేస్తూనే ఆ పద్దతిని నిలిపివేయాలని డిమాండ్ చేయటం. ప్రతిపక్ష ఎంఎల్ఏల నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ప్రజాస్వామ్యం మంట గలిసిపోతుందన్న సంగతి వారికి తెలియదా.

 

వైసీపీ ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు నిలిపి వేయటమన్నది చాలా కాలంగా జరుగుతున్నదే. ముఖ్యమంత్రే ఉద్దేశ్యపూర్వకంగా నిధులను నిలిపి వేస్తున్నట్లు ఎప్పటి నుండో వైసీపీ ఎంఎల్ఏలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా, వైసీపీ ఎంఎల్ఏలున్న చోట్ల టిడిపి నేతల పేర్లతోనే నిధులు మంజూరవుతున్న విషయం కూడా చంద్రబాబుకు సమ్మతితోనే జరుగుతున్నది.

 

ఇక, వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులకు కోట్ల రూపాయల పనులు అప్పగిస్తుండటం కూడా ఉద్దేశ్యపూర్వకమే. అసలు తమ పార్టీ నుండి కొందరు ఎంఎల్ఏలు ఫిరాయించిందే నిధుల కోసమని వైసీపీ ఎంఎల్ఏలే ఎన్నోమార్లు ఆరోపించారు. అందులో కూడా కొత్తేమీ లేదు. మరికొందరు శాసనసభ్యులను ఆకర్షించేందుకే చంద్రబాబు ఆపని చేస్తున్నారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు.

 

కాకపోతే వైసీపీ ఎంఎల్ఏలు సిఎంను కలిసి పై విషయాలపై ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యం. వారు కలిసినపుడు సిఎం సానుకూలంగ స్పందిస్తారని వాళ్ళు కూడా అనుకోలేదు. సిఎం సానుకూలంగా స్పందించలేదని వైసీపీ ఎంఎల్ఏలు ఆరోపణలు చేయటం, ఆ తర్వాత వైసీపీ ఎంఎల్ఏలపై టిడిపి మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యారోపణలు చేయటం ఒక వినోధం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !