నల్లధనంపై మోడి చెప్పినవన్నీ కథలేనా

First Published Nov 25, 2016, 10:57 AM IST
Highlights

దేశం వెలుపల గానీ దేశంలోపల గానీ ఎంత నల్లధనం ఉందో ప్రభుత్వానికి తెలియదని సాక్షాత్తు కేంద్ర ఆర్ధికశాఖ లిఖిత పూర్వకంగా పార్లమెంట్ కు తెలిపింది.

దేశంలో ఏ మేరకు నల్లధనం ఉందో కేంద్రం వద్ద లెక్కలు లేవా? దేశం వెలుపల ఎంత బ్లాక్ మనీ ఉందో కూడా కేంద్రప్రభుత్వానికి తెలీదా? మరి ఏమీ తెలీకుండానే నల్లధనం నియంత్రణ పేరుతో పెద్ద నోట్లను ఒక్కసారిగా ప్రధాని ఎలా రద్దు చేసారని యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. మొన్నటి ఎన్నికల సమయంలో  అన్నిలక్షల కోట్ల నల్లధనం ఉందని, ఇన్ని లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉందని స్వయాగా మోడినే మరి ఎలా చెప్పారు? అంటే అపుడు చెప్పినదంతా బిస్కెటేనా? అని ఇపుడు సామాన్యులకు సందేహాలు మొదలయ్యాయి.

 

బ్లాక్ మనీ గురించి ఇపుడు అందరికీ ఎందుకు సందేహం ఎందుకు వస్తున్నదంటే, దేశం వెలుపల గానీ దేశంలోపల గానీ ఎంత నల్లధనం ఉందో ప్రభుత్వానికి తెలియదని సాక్షాత్తు కేంద్ర ఆర్ధికశాఖ లిఖిత పూర్వకంగా పార్లమెంట్ కు తెలిపింది. నల్లధనం లెక్కల గురించి ఓ సభ్యడు వేసిన  ప్రశ్నకు ఆర్ధికశాఖ పై విధంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఆర్ధికశాఖ సమాధానం వినగానే పార్లమెంట్ సభ్యులు అందరూ ఒక్కసారిగి నివ్వెరపోయారు.

 

దేశంలో నల్లధనం పేరుకుపోతోందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్రమోడి మొన్న 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసారు. మరి ప్రధాని దగ్గర నల్లధనానికి సంబంధించిన ఎటువంటి లెక్కలు లేకుండానే పెద్ద నోట్లను రద్దు చేసారా అని జనాల్లో అయోమయం మొదలైంది. ప్రధానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేసారు. నోట్ల రద్దుకు ముందు కొందరు బడాబాబులు, పలువురు భాజపా నేతలు తమ వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది.

 

ఇటువంటి నేపధ్యంలోనే బ్లాక్ మనీ గురించి తమ వద్ద ఎటువంటి లెక్కలూ లేవని కేంద్ర ఆర్ధికశాఖ ఇపుడు సమాధానం చెప్పడంతో మోడిపై ఇంతకాలం వస్తున్న ఆరోపణలు నిజమేనని అనిపిస్తోంది.

 

click me!