కోటంరెడ్డి ఇల్లొదలి 42 రోజులయింది, జనం మధ్యే జీవనం

First Published Nov 9, 2017, 5:07 PM IST
Highlights

శ్రీధర్ రెడ్డి ఇల్లొదలి ఇప్పటికి 42 రోజులవుతుంది. 105 రోజులు సాగే ఈ యాత్ర ముగిసే దాకా ఇంటి గడప తొక్కనని, జనం మధ్యే జీవనం. జనం నీరాజనం.  

సమస్యలకు నిలయమయిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో  వైసిపిఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఈ రోజు 41వ  రోజుకి చేరింది. అడుగడుగునా ఆయనకు ప్రజలు హారతులు పడుతున్నారు. ఎమ్మెల్యే అంటే చుట్టుపక్కల జనమంతా భయపడి అదిరిపడేంతగా స్కార్పియోలలో, ఇన్నోవాలలో తిరిగే బాపతని అందరికి తెలుసు. వాళ్లని కలుసుకోవడం అందరికి సాధ్యమయ్యే పనికాదు. అందునా మురికివాడల నియోజవకర్గమయిన నెల్లూరు రూరల్ ప్రజలకు అది ఇంకా అసాధ్యం. అలాంటి చోట ఒక ఎమ్మెల్యే వినయంగా, విధేయంగా ప్రతి ఇంటి తలుపుతడుతున్నాడు. మీ ఇంట్లోకొస్తున్నా అని చొరబడుతున్నాడు. మీతో కలసి టీ తాగుతా భోజనం చేస్తా, మీ కుటుంబంలో ఒకడి మీ ఇంట్లో బస చేస్తానంటున్నాడు.

 

  వినేవాళ్లు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే, ఎమ్మెల్యేలు ఇలా చేస్తారా... చాలా మంది వూహకందడం లేదు. అయితే, వాళ్లెవరూ శ్రీధర్ రెడ్డి తమ ఇంట్లోకి చొరబడుతూంటే అవాక్కవ్వడం లేదు. కారణం, శ్రీధర్ రెడ్డి ఎపుడూ ఈ సందుల్లో గొందుల్లో కనిపించిన వాడే, కాకపోతే, మీ ఇంటికీ వస్తానంటున్నాడు. ఒక విధంగా ఆయన ఇల్లిళ్తూ తిరిగి  క్షమాపణ లు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను ఎంత పోరాడినా పనులు ఎలా కావో కూడ ఆయన వివరించిచెబుతున్నారు. అయినా, వదలనని, కాలనీ సమస్యలు పరిష్కరించేదాకా పోరాడాతానని, రేపు వైసిపి అధికారంలోకి వస్తే, ఈ కాలనీ సమస్యలన్నీ మొదటి నెలల్లోనే పరిష్కరిస్తానని వినయంగా చెబుతున్నారు. ఆయన చేపట్టిన ‘మన ఎమ్.ఎల్.ఎ - మన ఇంటికి’ కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ నిన్న 41 వ రోజు నారాయణరెడ్డి పేటలో ప్రవేశించారు. అక్కడ నాపా సుబ్బారావు ఇంట్లో బస చేశారు. ఈ రోజు ఉదయం 6.30 గం లకు తన పాదయాత్ర ప్రారంభించారు. ప్రతికాలనీలో ఆయన వందలాది మందిని పేరు పేరున పిలవగలరుంటే ఆశ్చర్యం గా ఉంటుంది. అది గత మూడేళ్ల చిన్న చిన్న పాదయాత్రల ప్రభావం. ఇపుడాయన నడస్తున్న నారాయణరెడ్డి పేటలో జనసాంద్రత ఎక్కువ. కనీస సౌకర్యాలు నిల్.  మూడేళ్లలో తానేమీచేయలేకపోయానని  ఒప్పకుంటున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారాయణ రెడ్డి పేట అన్ని గ్రామాల కన్నా ఎక్కువ మంది నివాసాలు ఉండే ప్రదేశం. పేరుకు మాత్రం నారాయణ రెడ్డి పేట నగర కార్పోరేషన్ లో విలీనం అయింది.అయితే, కార్పోరేషన్ కు సంబంధించిన ఒక్క సౌకర్యం  ప్రజలకు అందలేదు. డ్రైనేజి సమస్య వలన ప్రతి కుటుంబం ఇబ్బంది పడుతున్న విషయం తనకు తెలుసునని కూడా  అన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు 15 ఏళ్లుగా, 20 ఏళ్లుగా నివసిస్తున్నా  ఇళ్ళ స్థలాలు లేక ఉన్న పూరిగుడిసెలలో కనీసపాటి వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు.  ‘ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్ ఎల్ ఎ గా ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి నారాయణ రెడ్డి పేట సమస్య తీసుకెళ్లినా,ప్రయోజనం లేదు. నిరంతరం నారాయణ రెడ్డి పేట ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారం కోసం, కనీస వసతుల కల్పన కోసం పోరాటం చేస్తుంటాను. అధికార యంత్రాంగం చొరవతో ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తే స్వాగతిస్తా.అలా కానప్పుడు రేపటి రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా నారాయణ రెడ్డి పేటకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, పేదలకు ఇళ్ళ పట్టాల సమస్య, డ్రైనేజి సమస్య పరిష్కరిస్తాను,’ అని శ్రీధర్ ప్రజలకు మాట ఇచ్చారు.

శ్రీధర్ రెడ్డి ఇల్లొదలి ఇప్పటికి 42 రోజులవుతుంది. 105 రోజులు సాగే ఈ యాత్ర ముగిసే దాకా ఇంటి గడప తొక్కనని, జనం మధ్యే జీవనమని ఆయన మొదటి రోజే ప్రకటించారు. 

 

click me!