జగన్ కు పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్టిమేటమ్

First Published Nov 26, 2017, 11:20 AM IST
Highlights

ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకుని ఆయన కోసం తనకు సీటుకు ఎసరు పెడుతున్నారని ఈశ్వరి అనుమానం, ఎవరా ప్రత్యర్థి?

పాడేరు  వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  పార్టీ నేతకు అల్టిమేటమ్ జారీ చేసిందని తెలిసింది. ఈ అల్టిమేటమట్ తో ఆమె ఇకపార్టీ మారటం గ్యారంటని అంతా చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈశ్వరి వ్యవహారం పార్టీటో చర్చనీయాంశంగా మారింది. అయితే, అసలు కారణం తెలియలేదు. ఇపుడు తెలిసింది. మాజీ మంత్రి బాలరాజు వైసిపిలో చేరాలనుకుంటున్నారు. పసుపులేటి బాలరాజు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో గిరిజనశాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు చింతపల్లి, పాడేరులనుంచి రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచినా, 2014 లో ఆయన  గిడ్డి ఈశ్వరి చేతిలో ఓడిపోయారు. గిడ్డి ఈశ్వరికి ఆయనంటే గిట్టదు. ఆయన మీద పోటీ చేసి ఓడిస్తే, మళ్లీ ఆయన్ని పోటీలోకి తీసుకోవడానుకోవడమేమిటన్నది ఆమె ప్రశ్న.

తనకు ప్రత్యర్థి అయిన బాలరాజును పార్టిలోకి తీసుకుంటే తాను వైసిపి వదిలేసి తెలుగుదేశంపార్టీలోకి వెళతానని ఆమె పార్టీ అధినేత జగన్ కే చెప్పారని వినవస్తున్నది. వైసిపిని వదిలేస్తాననడం వేరు,వదిలేసి టిడిపిలోకి వెళతాననడం వేరు. అందువల్ల ఆమె టిడిపి ఒప్పందం కుదుర్చుకునే ఈ  అల్టిమేటం ఇచ్చారని  అంతా భావిస్తున్నారు.   బాలరాజు వల్ల  మీకు ఎలాంటి సమస్య రాదని  ఈశ్వరిని ఒపించేందుకు ఒక వైపు జగన్, మరొక వైపు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇది గాన్ కేస్ అని వైఎస్ ఆర్ పార్టీ నాయకులే అంటున్నారు. పాడేరు సీటును 2019లో తనకు ఇవ్వడేమో అనే అనుమానం ఆమె కలిగిందని, పాడేరు నుంచి పోటీచేయించేందుకే బాలరాజును పార్టీలో చేర్చుకుంటున్నారని ఆమె అనుమానిస్తున్నారు. ఆమెను పార్లమెంటుకు పోటీచేయించే వీలుంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయడానికి ఆమె వ్యతిరేకంకాదని, ఎటొచ్చి బాలరాజు కోసమో, మరొకనాయకుడు కుంబా రవికోసమో తనను ఖాళీచేయించాలనుకోవండం ఆమె నచ్చలేదు. అందుకే ఆమె టిడిపి తో అవగాహనకుదుర్చుకున్నారని,  ఈ మేరకు  ఆమెకు టిడిపి నాయకత్వం పాడేరు సీటు గ్యారంటి ఇవ్వడంతో పాటు ఇతరత్రా కూడా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది.  ఇక ముహూర్తం చూసుకుని దూకేడమేనని విశాఖ రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది.

 

 

click me!