మూడు నిమిషాల్లో.. ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయో తెలుసా..?

Published : Feb 23, 2018, 03:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మూడు నిమిషాల్లో.. ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయో తెలుసా..?

సారాంశం

భారీగా అమ్ముడైన షియోమి ఫోన్లు ఫిబ్రవరి 28న రెండో సేల్ ప్రారంభించనున్న షియోమి

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లోకి ఇటీవల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో పేరిట విడుదల చేసిన ఈ ఫోన్లకు గురువారం(ఫిబ్రవరి 22) ఫ్లిప్ కార్ట్ లో సేల్ నిర్వహించారు. కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు నిమిషాల్లో 3 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని షియోమి అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఫోన్లు లభించని వినియోగదారులు నిరాశకు గురయ్యారు.దీంతో.. వారి కోసం మరోసారి సేల్ నిర్వహించనున్నట్లు షియోమి ప్రకటించింది.

ఈ నెల 28వ తేదీన ఈ రెండు ఫోన్లకు మరోసారి సేల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదేవిధంగా ఈ ఫోన్లకు సరకొత్త ఫీచర్ ని కూడా తీసుకువచ్చింది. ఈ రెండు ఫోన్లలలో ఫేస్ అన్ లాక్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షియోమి అధికారికంగా ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu