షియోమి నుంచి స్మార్ట్ టీవీ

First Published Feb 14, 2018, 5:43 PM IST
Highlights
  • స్మార్ట్ టీవీని విడుదల చేసిన షియోమి
  • ఎంఐ టీవీ4 టీవీ ధర రూ.39,999గా ప్రకటించిన షియోమి

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లోకి టీవీని విడుదల చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భాంగా  షియోమి రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లను విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఫోన్లతో పాటు ఒక టీవీని కూడా ప్రవేశపెట్టింది. ఎంఐ టీవీ4 పేరిట ప్రవేశపెట్టిన ఈ టీవీలో హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్న అధునాతన 4కె ప్యానెల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ టీవీలో కనిపించే దృశ్యాలు అత్యంత క్వాలిటీతో ఉంటాయి. ఇక ఈ టీవీతోపాటు స్మార్ట్ రిమోట్‌ను కూడా అందిస్తున్నారు. దీని ద్వారా సెట్ టాప్ బాక్స్‌ ను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. 

షియోమీ ఎంఐ టీవీ4లో 55 ఇంచ్ 4కె డిస్‌ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ టీవీ ఓఎస్, వైఫై, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.39,999 ధరకు ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్‌ లో వినియోగదారులకు ఈ నెల 22వ తేదీ నుంచి లభ్యం కానుంది. టీవీని కొన్నవారికి 3 నెలల పాటు సోనీ లైవ్, హంగామా యాప్‌లలో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందివ్వనున్నారు. అలాగే ఉచిత ఇన్‌స్టాలేషన్, ఉచిత ఎంఐ ఐఆర్ కేబుల్‌ను అందిస్తున్నారు.

click me!