సెలబ్రేషన్స్ సరే... మరి బిల్లు ఎవరు కడతారు..?

First Published Feb 14, 2018, 5:17 PM IST
Highlights
  • ప్రేమికులపై క్యాష్ కరో.కామ్ ఆసక్తికర సర్వే
  • సర్వేలో ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించిన యువతీ యువకులు

ప్రేమికుల రోజుని దాదాపు ప్రేమికులందరూ సంతోషంగా గడుకుంటారు. సినిమాలకీ, షికార్లకు వెళతారు. మధ్యలో లంచ్, డిన్నర్ లాంటివి చాలా కామన్. ఈ సెలబ్రేషన్స్ అంతా బాగానే ఉన్నాయి కానీ.. మరి అన్నింటికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు..? ఇదే సందేహం క్యాష్ కరో.కామ్ అనే సంస్థకి కూడా వచ్చింది. అంతే.. వెంటనే దాదాపు 2వేల మంది యువతీయువకుల(16 నుంచి 30ఏళ్లలోపు)పై సర్వే చేసింది. ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అబ్బాయిలు, అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు ఖర్చు ఎక్కువగా అబ్బాయిలే భరిస్తారు. ఈ సర్వేలో కూడా అదే తేలింది. అయితే.. ఆ ఖర్చు భరించడానికి అబ్బాయిలే ఆసక్తి చూపిస్తున్నారు. 77శాతం మంది అబ్బాయిలు తమ ఇష్టపూర్వకంగా బిల్లు కడతామన్నారు. 64శాతం మంది అమ్మాయిలు మాత్రం ఖర్చు ఇద్దరూ షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు.

సాధారణంగా ప్రేమికుల రోజు అనగానే ఒకరికి మరొకరు ఏం గిఫ్ట్ ఇచ్చుకున్నారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇదే విషయంపై వారిని ప్రశ్నిస్తే.. గిఫ్ట్ కోసం రూ.2వేల నుంచి రూ.3వేల దాకా ఖర్చు పెడతామని చెప్పారు. 79శాతం మంది కచ్చితంగా బహుమతి ఇస్తామని చెప్పారు. మ్యారీడ్ కపుల్ మాత్రం గిఫ్ట్స్ లాంటివి లేకుండా సాయంత్రం పూట కలిసి డిన్నర్ చేయడానికి ఆసక్తి చూపిస్తామని చెప్పారు.

click me!