షియోమి ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’ వచ్చేసింది..!

Published : Nov 30, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
షియోమి ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’ వచ్చేసింది..!

సారాంశం

దేశ్ కా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన షియోమి రూ.4,999కే స్మార్ట్ ఫోన్

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ  షియోమి భారత మార్కెట్ లోకి కొత్త మోడల్ ఫోన్ ని ప్రవేశపెట్టింది.  ‘దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌’ పేరుతో ‘రెడ్‌మి 5ఏ’ మొబైల్‌ను రూ.5వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫోన్ ధర, ఫీచర్లను కంపెనీ వెల్లడించింది.

‘‘స్మార్ట్‌ ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలో షియోమి ఇండియా ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనుంది. అందులో భాగంగానే తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ+16బీజీ)ను రూ.4,999కే అందించనున్నాం’’ అని రెడ్‌మి ఇండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. డిసెంబర్‌ 7 మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌ లో తొలి సేల్‌ ప్రారంభం కానుంది.

ఫోన్ ఫీచర్లు..
 5 అంగుళాల హెచ్‌డీ టచ్ స్క్రీన్ 
స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌ 
 2జీబీ ర్యామ్‌ 
16జీబీ అంతర్గత మెమొరీ
5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 
ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌ 
మెమొరీకార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్‌ 
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu