చంద్రబాబుపై కేవీపీ ఫైర్

First Published Nov 30, 2017, 3:07 PM IST
Highlights
  • చంద్రబాబుపై మండిపడ్డ కేవీపీ
  • చంద్రబాబు గతం మరిచిపోయి మాట్లాడుతున్నారన్న కేవీపీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేవీపీ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. చంద్రబాబు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని ఆయన స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకెళ్లి చంద్రబాబు స్టేలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని కేవీపీ మండిపడ్డారు. తన స్వార్థం కోసమే ప్రత్యేక హోదాను చంద్రబాబు గాలికొదిలేశారని అన్నారు. 2019నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామంటున్న చంద్రబాబు.. రూ. 1800 కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. 2014నాటి అంచనాలతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. కేంద్రమే ప్రాజెక్టును చేపట్టి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు.

click me!