కొద్ది గంటల్లో మూడో ప్రపంచయుద్ధం మొదలవుతుందా?

First Published May 12, 2017, 11:02 AM IST
Highlights

కొంతకాలంగా ఉత్తరకొరియా, అమెరికా కేంద్రంగా జరుగుతున్న అనేక పరిణామాలు ప్రపంచయుద్ధం తప్పదన్న సంకేతాలనే పంపుతున్నట్లు ప్రముఖ అస్ట్రాలజర్ ప్రమోద్ గౌతమ్ తెలిపారు.

మరి కొద్ది గంటల్లో మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తం సమీపిస్తోందా? అది కూడా ఉత్తరకొరియ-అమెరికా కారణంగానే మొదలవ్వబోతోందా? కొంతకాలంగా ఉత్తరకొరియా, అమెరికా కేంద్రంగా జరుగుతున్న అనేక పరిణామాలు ప్రపంచయుద్ధం తప్పదన్న సంకేతాలనే పంపుతున్నట్లు ప్రముఖ అస్ట్రాలజర్ ప్రమోద్ గౌతమ్ తెలిపారు. ఆగ్రాకు చెందిన గౌతమ్ గతంలో అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని ముందుగానే చెప్పారట. కాబట్టి ఇపుడు కూడా ఆయన చెప్పినదాన్ని పలువురు నమ్ముతున్నారు.

 

గౌతమ్ అంచనాల ప్రకారం మరికొద్ది గంటల్లో ప్రపంచ వినాశనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మే 13వ తేదీన ఉత్తర కొరియా ఏ సమయంలోనైనా అమెరికాపై క్షిపణులతో దాడులు మొదలుపెట్టవచ్చట. దాంతో అమెరికా, అమెరికాకు మద్దతుగా నిలిచే దేశాలు కూడా ఉత్తరకొరియాపై ప్రతిదాడులు మొదలుపెడతాయని గౌతమ్ చెబుతున్నారు. రేపటి నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకూ ట్రంప్ పై కుజగ్రహం తీవ్ర ప్రభావం చూపుతుందట. దాని ఫలితంగా అమెరికా తీవ్రహింసను ఎదుర్కొనబోతోందని గౌతమ్ ఆందళన వ్యక్తం చేస్తున్నారు. 

                                                                                                                                                                                      

గౌతమ్ చెప్పారని కాదుగానీ కొద్ది కాలంగా ఉత్తరకొరియా వ్యవహారం చూస్తుంటే అమెరికాపై ఖచ్చితంగా దాడులు చేస్తుందన్న అనుమానాలు కలుగుతోంది. తన ఆయధాలలో ప్రధానమైన, ప్రమాదకరమైన రశాయన క్షిపణులను అమెరికావైపుకే మోహరించింది. క్షిపణుల సంఖ్యను కూడా భారీగా పెంచుకున్నది. అందుకే దాడులు చేస్తామంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అమెరికాకు బహిరంగ సవాలు విసురుతున్నారు.

 

మనిషి కూడా బాగా దూకుడు స్వభావం ఉన్న వాడే కావటంతో చుట్టుపక్కల దేశాలన్నీ కిమ్ దెబ్బకు వణికిపోతున్నాయి. అయితే, ప్రపంచయుద్ధాన్ని నివారించేందుకు గౌతమ్ ఈరోజు ఉదయం ఆగ్రాలో ఓ యజ్ఞాన్ని కూడా జరిపారులేండి. గౌతమ్ ప్రెడిక్షనే నిజమవుతుందో? లేక యజ్ఞమే ఫలితం ఇస్తుందో చూడాలి.

click me!