తెలుగు మహిళా జర్నలిస్ట్ కి బెదిరింపులు

First Published Apr 17, 2018, 3:13 PM IST
Highlights
కార్టూన్ వేయడమే ఆమె చేసిన నేరమా..?

ప్రముఖ మహిళా జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడి పేరు వినే ఉంటారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ జాతీయ మీడియాలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆమెను గత రెండు రోజులుగా కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమెను అభ్యంతరక భాషని ఉపయోగించి దూషిస్తున్నారు. ఆమెపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా..? ఆమె ఒక కార్టూన్ వేసినందుకు. మీరు చదివింది నిజమే .. కేవలం ఒక కార్టూన్ వేసినందుకే ఆమెను అభ్యంతరకర పదజాలంతో దూషించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల కతువాలో 8ఏళ్ల చిన్నారి ఆసిఫాను దారుణంగా  రేప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ సంఘటన. ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరో తెలిసినప్పటికీ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఉన్నావ్ లో ఓ 15 ఏళ్ల యువతిపై బీజేపీ ఎమ్మెల్యే, అతని సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. న్యాయం చేయాలంటూ ఆ యువతి యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ నివాసం ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలోనే స్వాతి ఓ కార్టూన్ వేశారు.

 

ఈ కార్టూన్ లో..‘నేను మీ భక్తుల చేతిలో కాకుండా రావణుడి చేతిలో అపహరణకు గురైనందుకు సంతోషంగా ఉంది’ అని సీతమ్మ రాముడితో అన్నట్టుగా ఉంది. సీతదేవి చేతిలో రేప్ ఘటలకు సంబంధించిన న్యూస్ పేపర్ ఉంటుంది.ఫేస్‌బుక్‌లో ఇప్పటి వరకు ఈ కార్టూన్‌ను ఐదు వేల మందికి పైగా షేర్ చేశారు. ట్విటర్‌‌లో ఎందరో రీట్వీట్ చేశారు. అదే ఆమె మీద తీవ్రస్థాయి ట్రోలింగ్‌కు కారణమైంది. సందర్భానుసారంగా వేసిన ఈ కార్టూన్ చాలా మందికి నచ్చలేదు అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా రేప్ చేసి హత్య చేసిన ఘటనను వదిలేసి.. మా మతాన్ని కించపరిచారంటూ స్వాతిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

 

ఆమెపై కేసులు పెడతామంటూ.. ఆమెకే మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టారు. అలా ఆమెకు పెట్టిన మెసేజ్ లను కూడా స్వాతి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.  ఈ విషయంపై స్వాతి మాట్లాడుతూ.. ‘‘జర్నలిజం వృత్తిలో ఉన్న నేను ఇలాంటి బెదిరింపులకు బయపడను. నాపై అలాంటి కామెంట్లు చేసినందుకు వాళ్లే సిగ్గుపడాలి’అని ఆమె అన్నారు.

click me!