
ఈ ఘటన ఢిల్లీలోని జగత్‌పూరిలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో పెద్దమ్మను మరుదుల కుమారులు చితకబాదారు.గత కొద్ది రోజుల నుంచి ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి.దీంతో ఆవేశానికి లోనైన మరుదుల కుమారులు.. ఆమెను నడిరోడ్డుపై చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.