రెడ్ రోజ్.. ప్రేమకు.. మరి ఆరెంజ్ రోజ్..?

First Published Feb 7, 2018, 4:41 PM IST
Highlights
  • ఏ రంగు గులాబీ ఎవరికి ఇవ్వాలి..?

వాలంటైన్ వీక్ వచ్చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి  వాలంటైన్ వీక్ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు రోజ్ డే. అంటే.. తమకు నచ్చిన వారికి రోజా పువ్వును అందించే రోజు అనమాట. ప్రేమను వ్యక్తపరచాలి  అంటే చాలు అందరూ ఎరుపు రంగు గులాబీ వైపు చూస్తారు. ఎందుకంటే.. ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. అందుకే అందరూ రెడ్ రోజ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి.. మిగిలిన రంగుల గులాబీల సంగతేంటి..? వాటికి ఎలాంటి ప్రత్యేకత లేదా..? అంటే ఉంది. మరి ఆ ప్రత్యేకతేంటో చూద్దామా...

రెడ్ రోజ్...

దీనికి ప్రేమకు విడదీయరాని బంధం. మాటల్లో చెప్పలేని ప్రేమను కేవలం ఒక రెడ్ రోజ్ ఇచ్చి చెప్పేయచ్చు. ఎవరైనా..అబ్బాయి కానీ.. అమ్మాయికానీ.. మరొకరికి రెడ్ రోజ్ ఇచ్చారూ అంటే.. వారు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు అర్థం.

తెలుపు రంగు గులాబీ..

 తెలుపును మనం శాంతికి చిహ్నంగా భావిస్తాం. తెలుపు రంగుని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. అదే గులాబీ విషయానికి వస్తే.. స్వచ్ఛత ను, అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు.. కొత్త స్నేహానికి, కొత్త బంధానికి కూడా తెలుగు రంగు గులాబిని గుర్తుగా భావిస్తారు. మీరు గమనించారో లేదో... చాలా మంది క్రిస్టియన్స్ పెళ్లిలో వధువు చేతిలో తెలుపు గులాబీలే ఉంటాయి. అంతేకాదండోయ్.. మీ ఫ్రెండ్ లేదా లవర్ తో గొడవపడితే.. ఈ వైట్ రోజ్ ఇచ్చి రాజీ పడొచ్చు.

 

పసుపు రంగు గులాబీ..

పసుపు రంగు గులాబీ స్నేహానికి గుర్తు. ఈ రోజ్ డే రోజు కేవలం ప్రేమికులే కాదు.. స్నేహితులు కూడా రోజ్ లను ఇచ్చిపుచ్చుకోవచ్చు. లవర్స్ ఛాయిస్ రెడ్ కలర్ అయితే.. ఫ్రెండ్స్ ఛాయిస్ ఎల్లో. అంతే తేడా.

గులాబి రంగు గులాబి...

చూడగానే ఆకట్టుకునే అందం ఈ రంగు గులాబీకి సొంతం. ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే.. ఈ రంగు గులాబీని ఎంచుకోవచ్చు. అది ఎవరైనా కావచ్చు. మీ లైఫ్ పార్టనర్, ఫ్రెండ్, సహోద్యోగి ఎవరికైనా దీనిని ఇవ్వొచ్చు.
ఆరెంజ్ కలర్ రోజ్...

 ఆరెంజ్ రంగు.. ఉత్సాహం, అభిరుచికి అద్దం పడుతుంది. కాబట్టి.. మీరు ఎవరినైనా.. అభినందించాలి అనుకుంటే.. ఈ రంగు రోజ్ ని ఎంచుకుంటే సరిపోతుంది.

 

click me!