ఆ పాటకు ఇంకా క్రేజ్ తగ్గలేదు..!

Published : Aug 01, 2017, 05:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఆ పాటకు ఇంకా క్రేజ్ తగ్గలేదు..!

సారాంశం

కోలవరి పాటకు తగ్గని క్రేజ్ యూట్యూబ్ లో 12.5 కోట్ల వ్యూస్

 ఆరు సంవత్సరాల క్రితం  తమిళ కథానాయకుడు ధనుష్ తన చిత్రం ‘త్రి’ కోసం ఓ పాట పాడారు గుర్తుందా.. ‘ వై దిస్ కొలవరి’ పాట. అంత సులభంగా మర్చిపోలేరులే ఆ  పాట. ఎందుకంటే .. పాట విడుదలై మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ పాట విడుదలై ఇప్పటికి సరిగ్గా ఆరు సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంకా దాని క్రేజ్ తగ్గలేదు. యూట్యూబ్ లో ఆ పాటని 12.5 కోట్ల మంది వీక్షించారు.

ఈ విషయాన్ని  ఆన్ లైన్ విజువల్ కంటెంట్  ప్రొవైడర్ అధికారికంగా ధ్రువీకరించారు. అభిమానులు ఎక్కువగా చూడటం వల్లే అది టాప్ లో నిలించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల తమిళంలో విడుదలైన ‘కబాలి’, ‘బాహుబలి’ చిత్రాల ట్రైలర్ లో తర్వాత స్థానాల్లో ఉన్నాయని వారు తెలిపారు.

ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘త్రి’ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయక. చిత్రం ఆశించినంత మేర ఆడకపోయినా.. అందులోని పాట మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !