
ముఖ్య మంత్రి చంద్రబాబు ఉచ్చులో పడవద్దని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడ పద్మనాభం హితవు చెప్పారు.
ఈ మేరకు ఆయన జనసేనానికి ఒక లే ఖ రాశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు కుమ్మరించి కాపులను మోసగించిన వైనాన్ని ముద్రగడ లేఖలో వివరించారు. ఇప్పటికే ఎన్నో వర్గాల వారికి హామీల వర్షం కుమ్మరించారు. ఈ హామీలన్ని నీటి మీద రాతల్లాగే ఉన్నాయన్న విషయం గమనించాలని ఆయన పవన్ ను కోరారు. ’అటువంటి అబద్దాలను నిజమని నమ్మి, మీరు వారితో ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోవద్దని కోరుచున్నానండి,’అని ముద్రగడ జనసేన నాయకుడికి విజ్ఞప్తి చేశారు. లేఖ ఇది.