ఏం చదివారు.. ఏక్కడ చదివారు

First Published May 23, 2017, 7:19 PM IST
Highlights

ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల విద్యార్హతల విషయంపై మాత్రం అధికార బీజేపీ యంత్రాంగం కక్కలేకమింగలేక సతమతమవుతోంది.

దేశంలో అత్యంత కీలక పదవిలో ఉన్న ఇద్దరు నేతలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఎన్డీయే పాలన ఏలాంటి అవినీతి మరకలు లేకుండా సాఫీగానే సాగుతోంది. అయితే ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల విద్యార్హతల విషయంపై మాత్రం అధికార బీజేపీ యంత్రాంగం కక్కలేకమింగలేక సతమతమవుతోంది.

 

ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రతిపక్షాలు పెద్దస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన డిగ్రీ నకిలీదంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనిపై నిజానిజాలు వెల్లడించాలంటూ కొందరు సమాచార కమిషన్ ను కూడా ఆశ్రయించారు.

 

ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన చదవిని డిగ్రీ సర్టిఫికేట్ల ఒరిజనల్స్ ఇవ్వాలని కోరారు. అయితే ఢిల్లీ యూనివర్సిటీ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ప్రతిపక్షాలు ఈ అంశతో మోదీని టార్గెట్ ను చేస్తూనే ఉన్నాయి. ఇక కేంద్ర మంత్రి స్మృతిఇరానీ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు.

 

ఆమె విద్యార్హత సర్టిఫికేట్లు ఇవ్వాలని అహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి గతంలో కిందిస్థాయి కోర్టులో ఫిటిషన్‌ వేశారు. అయితే అప్పుడు కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లగా విచారణకు స్వీకరించిన కోర్టు స్మృతి ఇరానీ విద్యార్హత రికార్డులు ఇవ్వాలని తాజాగా ఆదేశించింది.

 

click me!