
సినిమా హీరోలు ఎందరో ఉండగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే రాజభవన్ ‘ఎట్ హోం’ ప్రత్యేక ఆహ్వానం ఎలా అందింది?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో రోటీన్ గా ‘ఎట్ హోం ’ జరుగుతుంది. దీనిని రాజకీయ, పుర ప్రముఖులను ఆహ్వనిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత మూడు సార్లు ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. అపుడెపుడూ పవన్ కల్యాణ్ ఆహ్వానం అందలేదు. ఆయనా రాలేదు. ఈ సారే ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రత్యేకాహ్వానితుడిగా ఆయన వచ్చారు. ఈ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెకమెండేషన్ తోనే వెళ్తిందని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి వారం కిందట విజయవాడకు వచ్చిన గవర్నర్ నరసింహన్ కు సూచించినట్లు వాళ్లు చెబుతున్నారు.
మొన్న ఉద్దానం కిడ్నీ సమస్య గురించి చర్చించేందుకు అమరావతి వెళ్లినపుడు తనకు లభించిన గౌరవంతో పవన్ తలకిందులై పోయిన సంగతి చూసిందే. ప్రతిసారి ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కుతూ ఉంది. ఒకసారి ఏకంగా ప్రత్యేక విమాన గౌరవం దక్కిన సంగతి కూడ చూశాం. ఉద్దానం చర్చల పుడు చంద్రబాబు అందించిన అతిధి మర్యాదలతో పవన్ మనుసు మారిపోయి, ఆయన మీద గౌరవ పెరిగిపోయి, కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రకటించారు. ఇది చంద్రబాబు కు రాజకీయంగా బాగా పనికొచ్చింది. మొదటిది, చాలా ఈజీగా పవన్ కోరలను ఆయన పెరికేశాడు. ఇక చంద్రబాబుతో నే పవన్ ఉంటాడన్న మెసేజ్ పంపాడు. ముద్రగడ కూడా పవన్, చంద్రబాబు కలసిపోయారని భావించాడు. ఇది జనసేనకు చావు దెబ్బ. ఈ రాజకీయాటని పవన్ పసిగట్టినట్లు లేదు. బాబు మాత్రం బాగా సక్సెస్ అయ్యారు. ఈ రాజకీయాన్ని రాజ్ భవన్ దాకా పొడిగించి, అక్కడ కూడా ‘ప్రత్యేక గౌరవం’ దక్కించి, ముఖ్యమంత్రులతో సమానంగా గవర్నర్ పక్కన ఒక సీటుచూపిస్తే పవన్ ఇంకా ఖుషీ అయిపోతాడు. ప్రజల్లో కూడా పవన్-బాబు ఒక్కటయ్యారనేది బలంగా నాటుకుపోతుంది. 2019 ఎన్నికల నాటికి పవన్ లేవకుండా పడిపోతాడు, లేచినా జైచంద్రబాబు అనేస్తాడు.
పవన్ రాజ్ భవన్ ఆహ్వానం వెనక ఉన్న రాజకీయమిది అని చాలా మందిచెబుతున్నారు. చంద్రబాబును అర్థం చేసుకోవడానికి పవన్ కు చాలా కాలం పడుతుంది. అప్పటికి చేతులు కాలిపోతాయి. పట్టుకునేందుకు ఆకులు కూడా ఉండవు.