ఏ క్యాబ్ చీప్.. అని అడిగినందుకు...

First Published Aug 28, 2017, 3:20 PM IST
Highlights
  • వోలా, ఉబర్ రెండు కంపెనీలను తన ట్వీట్ లో ట్యాగ్ చేశాడు
  • అతని ట్వీట్ కి వోలా క్యాబ్స్ స్పందించింది.

 

#Help My friends with hearing loss are planning a trip from Bangalore to Mysore.

Which one is cheaper @Olacabs or @Uber_India ?  #PlzRT

— Jeroz (@JerozNishanth) 23 August 2017

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన మిత్రుల కోసం క్యాబ్ బుక్ చేద్దామనుకున్నాడు. అందు కోసం ఏ కంపెనీ క్యాబ్ అయితే.. తక్కువ ఖర్చు అవుతుందని అతను ట్విట్టర్ వేదికగా అడిగాడు. అందుకు అతనికి ఊహించని సమాధానం వచ్చింది. అది కూడా ప్రముఖ క్యాబ్ కంపెనీ నుంచి . వివరాల్లోకి వెళితే..

 బెంగళూరుకు చెందిన జార్జ్ నిషాంత్ మిత్రులు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి బెంగళూరు నుంచి మైసూరు వెళదామనుకున్నారు. వారి కోసం జార్జ్ క్యాబ్ బుక్ చేయడానికి ఏ క్యాబ్ అయితే తక్కువ ఖర్చు అవుతుందంటూ ట్విట్టర్ లో తన ఫాలోవర్లను అడిగాడు. అంతేకాకుండా వోలా, ఉబర్ రెండు కంపెనీలను తన ట్వీట్ లో ట్యాగ్ చేశాడు. అతని ట్వీట్ కి వోలా క్యాబ్స్ స్పందించింది.

వోలా క్యాబ్స్, జార్జ్ కి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది..

వోలా.. ఉచితంగా రైడ్ ఇస్తే?

జార్జ్.. మీరు సీరియస్ గా చెబుతున్నారా? ప్లీజ్ జోకులు వేయకండి.

వోలా.. అఫ్ కోర్స్.. మా నుంచి మీ ఫ్రెండ్స్ ఈ రైడ్ ని బహుమతిగా ఇస్తున్నాం. అంతేకాదు... వారిని తిరిగి మైసూర్ నుంచి బెంగళూరుకు తీసుకువస్తాం.

జార్జ్.. కానీ మా ఫ్రెండ్స్ మొత్తం ఆరుగురు ఉన్నారు. వాళ్లు అక్కడ మూడు రోజులు ఉంటారు.

వోలా.. పర్వాలేదు.. మీ  ఫ్రెండ్స్ ని వోలా అవుట్ స్టేషన్ ని రైడ్ లేటర్ ఆప్షన్ తో క్యాబ్ బుక్ చేసుకొని.. సీఆర్ ఎన్ నెంబర్ ని షేర్ చేయమని చెప్పండి.

జార్జ్.. బుక్ చేశాం. చాలా థ్యాంక్స్..

ఈ విధంగా ట్విట్టర్ వేదికగా వారి సంభాషణ కొనసాగింది.

కాగా.. దీనిపై జార్జ్ మాట్లాడుతూ.. నిజంగా వోలా ఇలా స్పందించి తమకు ఉచితంగా రైడ్ ఇస్తుందని అనుకోలేదన్నాడు. తాను కేవలం సమాచారం కోసం తన ట్విట్టర్ ఫ్రెండ్స్ ని అడిగానని తెలిపారు. అనంతరం జార్జ్ మిత్రులంతా ఓలాకు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో వీడియో పోస్టు చేశారు.

click me!