సరదా కాస్త బెడిసికొట్టింది...(వీడియో)బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ తన కుమార్తెతో కలిసి చేసిన సరదా కాస్త బెడిసికొట్టింది. ఇంతకీ అక్షయ్ ఏమి చేశాడా అని అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం చదవండి.. అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఇటీవల విహారయాత్ర నిమిత్తం తన సోదరి రింకూతో కలిసి ఆస్ట్రియా వెళ్లారు. ఆయన కుమారుడు ఆరవ్‌ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. దీంతో ఇంట్లో అక్షయ్‌, ఆయన కుమార్తె నిటారా మాత్రమే మిగిలారు.ఈ నేపథ్యంలో గత ఆదివారం అక్షయ్ కుమార్తె నిటారాను ఉయ్యాల ఎక్కించి ఆడిస్తున్నారు. పాప ఉయ్యాల వూగుతున్నప్పుడు అక్షయ్‌ ఎదురుగా నిలబడ్డారు. దీంతో అనుకోకుండా పాప కాళ్లు అక్షయ్‌ తలకు తగలబోయాయి. తప్పించుకోబోయిన అక్షయ్‌ వెనక్కి పడబోయారు. దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘డ్యాడీ డేఅవుట్‌ బెడిసికొట్టింది’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ‘గోల్డ్‌’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ప్యాడ్‌మ్యాన్‌’చిత్రాల్లో నటిస్తున్నారు.Daddy's day out gone wrong 😬🙈😂 #ParentLife pic.twitter.com/qygsDRsF2U— Akshay Kumar (@akshaykumar) 25 July 2017