అమెరికా పైలెట్లకు చుక్కలు చూపించిన చైనా పైలెట్లు

Published : Jul 26, 2017, 01:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అమెరికా పైలెట్లకు చుక్కలు చూపించిన చైనా  పైలెట్లు

సారాంశం

చైనా స్థావరాల పై అమెరికా యుద్ద విమానాలు. ధీటుగా ఎదుర్కొన్న చైనా పైలేట్. అభ్యంతరం తెలిపిన గ్లోబల్ టైమ్స్. 

చైనా స్థావరాల పై అమెరికా యుద్ద విమానాలు ప్రయాణించాయి. అది తెలుసుకున్న చైనా అధికారులు రంగంలోకి దిగారు. చైనా కూడా అమెరికా యుద్ద విమానాలకు దీటుగా తమ యుద్ద విమానాలను ప్రవేశ పెట్టింది. చైనా పైలేట్లు అమెరికా ఫైలేట్లకు సరైనా సమాధానం చెప్పారు.

అమెరికా అధిప‌త్యానికి చైనా చెక్ పెట్టింది. ప్ర‌పంచ అధిప‌త్యం కోసం చైనా కుడా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుంది. తాజాగా చైనా చేస్తున్న ప్ర‌య‌త్నాలు త‌మ ప్ర‌యోజనాల‌కు భంగం చేకూర్చేవిగా ఉన్నాయ‌ని భావించిన‌ అమెరికా. చైనా లో ప‌రిస్థితుల‌ను తెలుసుకోవ‌డానికి యుద్ద విమానం రంగంలోకి దిగింది. అందుకు అంత‌ర్జాతీయ గ‌గ‌న త‌లంలో అమెరికా యుద్ధ విమానం చక్కర్లు కొట్టింది. అమెరికా నిఘా సంస్థకు చెందిన ఈపీ-3లు రంగంలోకి దిగాయి.

 ఆదివారం సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో చైనా స్థావ‌రాల పై నిఘా కోసం ఈపీ-3 విమానాలు త‌న ప్ర‌య‌త్నం ప్రారంభించాయి. తూర్పు చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో ప్రయాణిస్తుండ‌గా.. అంతలోనే.. చైనాకు చెందిన రెండు జే-10 యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. అప్పుడు చైనా పైలెట్ అమెరికా యుద్ద విమానాన్ని దాదాపుగా ఢీ కొట్టే ప‌రిస్థితి తెచ్చాడు. అంత‌ర్జాతీయ గ‌గ‌న త‌లంలో ప్ర‌యాణిస్తున్న అమెరికా యుద్ధ విమానాలలో ఒక‌టి కింద‌కు వ‌చ్చింది. కిందికి వచ్చిన అమెరికా విమానానికి నేరుగా చైనా విమానం పైలెట్ ముందుకు సాగించారు. చైనా యుద్ద విమానం త‌మ వైపు నేరుగా వ‌స్తున్న విష‌యం గ‌మనించిన‌ అమెరికా పైలట్‌ ఒక్కసారిగా విమానాన్ని నిటారుగా పైకి తీసుకెళ్లాడు. దీంతో అమెరికా నిఘా విమానం పైలెట్లు బెంబేలెత్తారు. విమానం వేగాన్ని తగ్గించి, పక్కకు తిప్పేశారు. లేకపోతే ఇరు దేశాల‌కు చెందిన రెండు యుద్ద విమానాలు ఢీకొనేవే. అంతేకాదు... చైనా యుద్ధ విమానాలు అమెరికా నిఘా విమానానికి అటూ ఇటుగా అనుకునేంత దగ్గరగా కొద్దిసేపు ప్రయాణించాయి. ఇదంతా ఏమాత్రం సురక్షితం కాని రీతిలో జరిగిందని పెంటగాన్‌ ప్రతినిధి తెలిపారు.


 మరోవైపు ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో లక్ష్యాలు సాధించుకునేందుకు చైనా తెంపరితనం ప్రదర్శిస్తోందని సీఐఏ ఆక్షేపించింది. గ్లోబ‌ల్ టైమ్స్ కూడా అమెరికా కావాల‌ని తమ దేశాన్ని టార్గెట్ చేస్తుంద‌ని, ఇది స‌రైనా పద్ధతి కాదంటు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !