జూన్ 30 తర్వాత ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్ !!

First Published Mar 3, 2017, 1:00 PM IST
Highlights

జూలై నుంచి విండోస్ 7 ఆధారిత ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు.

ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ సంచనల నిర్ణయాన్ని తీసుకుంది. జూన్ 30 తర్వాత తన సేవలను విండోస్7 ఆధారిత ఫోన్లలో నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించింది.

 

వాట్సాప్ యాజమాన్యం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

 

ప్రస్తుతం వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్లను తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ సేవలను విండోస్ 7 అప్లికేషన్‌కు తగినట్టుగా మార్చలేమని తెలిపింది.


గతంలో విండోస్ 7 లో పనిచేసేలా వాట్సాప్ ను సిద్దం చేస్తామని ప్రకటించిన సంస్థ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

 

వాట్సాప్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా  విండోస్ ఆధారిత డివైజ్‌ల్లో వాట్సాప్ జూన్ నెల చివరనాటికి మాత్రమే పనిచేస్తుంది.

 

జూలై నుంచి విండోస్ 7 ఆధారిత ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు.

 

click me!