మీది అప్‌డేట్‌డ్ మొబైల్ కాదా..? అయితే ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేయలేరు..!!

First Published Jun 18, 2018, 1:34 PM IST
Highlights

మీది అప్‌డేట్‌డ్ మొబైల్ కాదా..? అయితే ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేయలేరు..!!

వాట్సాప్.. వాట్సాప్.. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఇది లేనిదే ఏ పని జరగని స్థితికి ప్రస్తుతం ప్రపంచం చేరుకుంది. ఫ్రెండ్స్‌తో ఛాటింగ్.. వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్ని రకాల అవసరాలకు జనం వాట్సాప్‌ మీదే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులున్నారు. ఇలాంటి వారిలో కొందరికి వాట్సాప్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. పాత ఆపరేటింగ్  సాఫ్ట్‌వేర్ వెర్షన్లతో కూడిన మొబైల్స్‌కు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి..

ఆండ్రాయిడ్ 2.3.3 కంటే ముందు వెర్షన్లు, విండోస్ 8.0 కంటే ముందున్నవి.. ఐవోయాస్ 6, సింబియాన్ ఎస్ 60, బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10 ఓస్ ఉన్న సెల్‌ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయదు.. అలాగే మరికొన్ని పాత ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ వెర్షన్లకు వాట్సాప్ ఇన్‌స్టలేషన్ అనుమతించబదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇందులో వాట్సాప్ కొంత వెసులుబాటు కలిపించింది. నోకియా ఎస్ 40 వెర్షన్ మొబైల్ ఉన్న వారు ఈ ఏడాది డిసెంబర్ వరకు, ఆండ్రాయిడ్ 2.3.3, 2.3.7,  ఐవోఎస్ 7 వెర్షన్ వాడుతున్న వారు 2020 ఫిబ్రవరి 1 వరకు వాట్సాప్ సేవల్ని పొందవచ్చని తెలిపింది. 

click me!