18జూన్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

Published : Jun 18, 2018, 09:52 AM IST
18జూన్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

సారాంశం

బహుమతి అందించే అవకాశమున్నది.

మేషం

ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం, అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతున్నది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృషభం

ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశమున్నది. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతున్నది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం

ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాలతో ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం

ఈరోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు, వ్యవహార శైలి ఎదుటివారిని ఇబ్బంది పెట్ట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

సింహం

ఈరోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

కన్య

ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కానీ, విలువైన వస్తువులు నష్టపోవటం కానీ జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మాట కారణంగా వివాదం రావటం కానీ, సమస్య రావటం కానీ జరుగుతుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం.

తుల

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

వృశ్చికం

ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారులను కలువటానికి అనుకూలదినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు

ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.
 

మకరం

ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

కుంభం

ఈ రోజు మీ ఇంటికి, వాహన కొనుగోలుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి దేవాలయ సందర్శన కానీ, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం

ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి అనుకోని మార్పు ఉంటుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావటం కానీ, ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు అంతగా అనువైన రోజు కాదు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu