వాట్సాప్ కి లీగల్ నోటీసులు

First Published Dec 27, 2017, 11:12 AM IST
Highlights
  • ‘‘మిడిల్ ఫింగర్’’ ఎమోజీని.. 15 రోజుల్లో వాట్సాప్ నుంచి తొలగించాలని కోరుతూ కేసు ఫైల్ చేశారు.

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ కి ఓ న్యాయవాది లీగల్ నోటీసులు జారీ చేశారు. వాట్సాప్ లోని ఎమోజీలలో ఒక ఎమోజీని తొలగించాలని కోరుతూ.. ఆయన కోర్టులో కేసు వేశారు. వివరాల్లోకి వెళితే.. దేశరాజధాని ఢిల్లీకి చెందిన  న్యాయవాది గుర్మీత్ సింగ్.. మంగళవారం వాట్సాప్ కి లీగల్ నోటీసులు జారీ చేశారు. ‘‘మిడిల్ ఫింగర్’’ ఎమోజీని.. 15 రోజుల్లో వాట్సాప్ నుంచి తొలగించాలని కోరుతూ ఆయన ఈ కేసు ఫైల్ చేశారు. మిడిల్ ఫింగర్ చూపించడం అనేది చాలా అభ్యంతకరమైనదని, అదేవిధంగా అశ్లీలానికి గుర్తు అని  గుర్మీత్ అన్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354, 509 ప్రకారం.. అభ్యంతకర, అశ్లీల చిహ్నాలను మహిళలకు చూపించడం నేరమని  గుర్మీత్ పేర్కొన్నారు. సెక్షన్6, క్రిమినల్ జస్టిస్ చట్టం 1994 ప్రకారం.. ఐర్లాండ్ లో మిడిల్ ఫింగర్ చూపించడం నేరమని ఆయన వివరించారు. ప్రస్తుతం వాట్సాప్ లో మిడిల్ ఫింగర్ ఎమోజీ ఉందని.. దానిని వెంటనే తొలగించాలని ఆయన కోరారు. 15రోజుల్లో కనుక ఆ ఎమోజీని తొలగించకపోతే.. సివిల్, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తానని హెచ్చరించారు.

click me!