ఆస్ట్రేలియాలో తెలంగాణ టెకీ అనుమానాస్పద మృతి

First Published Dec 26, 2017, 6:57 PM IST
Highlights
  • ఆస్ట్రేలియాలో తెలంగాణ టెకీ మృతి
  • మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

ఆస్ట్రేలియాలో చక్కటి ఉద్యోగం లభించడంతో అతడు ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఆరు నెలలుగా హ్యాపీగా జీవిస్తున్నాడు.  అయితే హఠాత్తుగా ఏమైందో ఏమో తెలీదు కానీ తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. ఈ విషాద సంఘటన సిడ్నీలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో అనుమానాస్పద రీతిలో చనిపోయింది ఓ తెలంగాణ ఉద్యోగి కావడంతో ఇక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోన ఆదినారాయణ రెడ్డి ఇన్పోసిస్ లో ఉద్యోగం చేసేవాడు. అయితే అతడి సేవలు ఆస్ట్రేలియాలో అవసరమని బావించిన కంపెనీ అతడిని ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియా కు పంపించింది.   ఇందులో భాగంగా బార్యా, పిల్లలను  ఇండియాలోనే ఉంచి ఆస్ట్రేలియాకు ఒక్కడే వెళ్లాడు. అయితే అతడు ఈ ఆదివారం తన బార్యకు ఫోన్ చేసి చలి జ్వరం మరియు తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు.  అయితే ఇది అంత సీరియస్ గా ఏం లేదని మందులు తీసుకున్నట్లు భార్యతో తెలిపాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడి మొబైల్ గానీ, ల్యాండ్ ఫోన్ గానీ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య అక్కడే సిడ్నీలో ఉండే తన బందువులకు సమాచారమిచ్చింది. దీంతో వారు నారాయణ రెడ్డి నివాసానికి వెళ్లి చూడగా అతడు శవంగా పడి ఉన్నాడు. దీంతో వారు భార్య సిరీష తో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

 అయితే తన కొడుకు అనుమానాస్పద మృతి పై తండ్రి వెంకట్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.  ఈ మరణానికి సంబంధించి సిడ్నీ పోలీసులతో దర్యాప్తు చేయించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అతడు కోరాడు. అలాగే మృత దేహాన్ని ఇండియాకు తరలించడానికి కూడా సహకరించాలని అతడు, అతడి కుటుంభసభ్యులు  ప్రభుత్వాన్ని కోరారు.
 

click me!