వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ‘ డిలిట్ ఫర్ ఎవ్రీ వన్’

First Published Oct 27, 2017, 5:46 PM IST
Highlights
  • వాట్సాప్ లో కొత్త ఫీచర్
  • రాంగ్ మెసేజీలను డిలీట్ చేసే సదుపాయం

వాట్సాప్ లో ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసేటప్పుడు.. ఒక్కోసారి ఒకరికి పంపాల్సినన మెసేజీ.. పొరపాటున మరొకరికి పంపుతుంటాం. ఇలాంటి పొరపాటు చాలా మందికి ఎదురై ఉంటుంది. అయితే.. ఇక ముందు ఆ పొరపాటును సరిదిద్దుకోవచ్చు. అందుకు వీలుగా  వాట్సాప్ లో  ‘ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ పేరిట కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.  ఎవరికైనా రాంగ్ మెసేజీ పంపితే.. వెంటనే దానిని డిలీట్ చేసుకోవచ్చు. కాకపోతే.. ఈ ఫీచర్ ని ప్రస్తుతం కొద్ది మందికి మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వాట్సాప్‌ను కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. టెక్ట్స్‌ మెసేజీలు, చిత్రాలు, జిఫ్‌ ఫైల్స్‌, వీడియోలు, కాంటాక్ట్ లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్‌ ద్వారా రీకాల్‌ చేసుకోవచ్చు. అయితే ఈ మెసేజ్‌లు రీకాల్‌ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్‌ను కొత్త వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్‌లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్‌ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది.

click me!