
ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ప్రతిపక్ష నేత జగన్ ని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోల్చి మాట్లాడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. మీడియాతో మాట్లాడిన కేఈ జగన్ కన్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మేలు అని పేర్కొన్నారు. ఈ విషయంలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో రాష్ణ్ర ముఖ్యమంత్రితో పోల్చవచ్చు. ఎందుకంటే.. ఇద్దరూ ఒకే డిజిగ్నేషన్ లో ఉన్నారు కాబట్టి. కానీ.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కి, తెలంగాణ సీఎం కేసీఆర్ కి పోలికేంటి? ఏ విషయంలో వారిద్దరినీ కంపేర్ చేస్తారు? కానీ ఇక్కడ కేఈ అదే చేశారు. చంద్రబాబుని పొగడటం ఇష్టం లేక... ఒకసారి జగన్ ని, మరోసారి కేసీఆర్ ని పొగుడుతున్నాడా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లేక రానున్న ఎన్నికల్లో.. టీడీపీ ఓడిపోతుందనే నిర్ణయానికి కేఈ వచ్చారా? 2019 ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలిచి జగన్ సీఎం అవుతారని భావిస్తున్నారా? అందుకే ఈ పోలికలు తెస్తున్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు. లేదా.. వయసు ప్రభావం ఎక్కువై.. ఏమి మాట్లాడాలో తెలిక.. మీడియా ముందు తోచినట్లు మాట్లాడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇదే విధంగా కేఈ వ్యాఖ్యలు కొనసాగితే.. చంద్రబాబుకి కొత్త తల నొప్పులు రావడం ఖాయం.