వాట్సాప్ లో మరో న్యూ ఫీచర్..

First Published Aug 28, 2017, 4:57 PM IST
Highlights
  • వెరిఫైడ్ ఎకౌంట్స్ సౌలభ్యాన్ని తర్వలో వాట్సాప్ లో చేర్చనున్నారు.
  • త్వరలోనే ఇది  వినియోగదారులకు అదుంబాటులోకి రానుంది.

 

 ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో న్యూ ఫీచర్‌ రాబోతోంది. వెరిఫైడ్ ఎకౌంట్స్ సౌలభ్యాన్ని తర్వలో వాట్సాప్ లో చేర్చనున్నారు.  ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో అఫిషియల్ ఎకౌంట్ ని కనిపెట్టడం సులభం. అధికారిక ఎకౌంట్ కి టిక్ మార్క్ ఉంటుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌కు మాత్రమే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఇప్పుడు వాట్సాప్ లోనూ ప్రవేశపెడుతున్నారు. త్వరలోనే ఇది  వినియోగదారులకు అదుంబాటులోకి రానుంది.

కాకపోతే..బిజినెస్‌ ప్రొఫైల్స్‌కు మాత్రమే ఈ సౌలభ్యం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే కొన్ని బిజినెస్‌ అకౌంట్లను తనిఖీ చేశామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. తనిఖీ చేసిన ఖాతాలకు పేరు తర్వాత ఇకపై ఆకుపచ్చ బ్యాడ్జ్‌తో పాటు, తెలుపు రంగు టిక్‌మార్కు ఉంటుందని పేర్కొంది. వీటిని ఇతర ఖాతాల మాదిరిగానే బ్లాక్‌ చేసే సౌలభ్యం కూడా ఉందని కంపెనీ పేర్కొంది.

బిజినెస్‌ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే.. పూర్తి చిరునామా, ఈ-మెయిల్‌, వెబ్‌సైట్‌ వంటి వివరాలు అందులో దర్శనమిస్తాయి. ఒక వేళ సంబంధిత ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉంటే అక్కడ ఆ లింకు కూడా కనిపిస్తుంది.

ఈ సదుపాయం ద్వారా అది నిజంగా వెరిఫైడ్ ఎకౌంట్ అవునో కాదో.. సులభంగా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

click me!