వాట్సప్ అడ్మిన్ లు అక్కడ జర జాగ్రత్త

Published : Apr 20, 2017, 03:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
వాట్సప్ అడ్మిన్ లు అక్కడ జర జాగ్రత్త

సారాంశం

వాట్సాప్‌ గ్రూపుల్లో వదంతులు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సదరు గ్రూపు అడ్మినిస్ర్టేటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు వారణాసి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన టెక్నాలిజీలో వాట్సప్ కూడా ఒకటి. ఈ ఒక్క యాప్ తో దూరతీరాన ఉన్న బంధాలు కూడా సెకన్ లో కనెక్ట్ అయిపోతున్నాయి. ప్రతి మనిషి జీవితంలో ఇప్పుడు వాట్సాప్ ఓ భాగమైపోయిందనడంలో సందేహమే లేదు.

 

అయితే వాట్సాప్ సందేశాలు ఒక్కోసారి ప్రజల మద్య విద్వేశాలను రెచ్చగొడుతున్నాయి. అసత్య వార్తలు, వదంతులు వ్యాప్తి జరిగి అసలుకే మోసం వస్తోంది.ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లా యంత్రాంగం మొట్టమొదటిసారిగా వాట్సాప్ లో వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

 

వాట్సాప్‌ గ్రూపుల్లో వదంతులు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సదరు గ్రూపు అడ్మినిస్ర్టేటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు వారణాసి జిల్లా మెజిస్ర్టేట్‌ యోగేశ్వర్‌ రామ్‌ మిశ్రా, సీనియర్‌ ఎస్పీ నితిన్‌ తివారీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

 

ముఖ్యంగా వదంతులు వ్యాప్తి చేసే వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ లు జాగ్రత్తగా ఉండాలని, మతపరమైన అశాంతికి దారితీసే అసత్య ప్రకటనలు, వదంతులు గ్రూపులోని సభ్యులెవరైనా వ్యాప్తి చేస్తే గ్రూపు అడ్మిన్‌ దాన్ని తొలగించాలని ఆదేశించారు. లేకపోతే అడ్మిన్ పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

 

అయితే ఈ ఆదేశాలు వారణాసి జిల్లా వరకే పరిమితమవుతాయి. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు లోబడే చర్యలుంటాయని పోలీసులు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !