“జయ ఆస్తిలో నాకూ వాటా ఉంది...”

Published : Dec 24, 2016, 08:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
“జయ ఆస్తిలో  నాకూ  వాటా ఉంది...”

సారాంశం

 పోయస్ గార్డెన్ లోని జయలలిత నివాసం ‘ వేద నిలయం’ లో తనకూ వాట ఉందంటున్న మేన కోడలు దీప జయకుమార్

 

అమె జయలలిత కు మేనకోడలు.

 

ఎవరన్నా, పాలిటిక్స్ కాదన్నా ఆమెకు జయలలితతో  ఉన్నది చాలా దగ్గరి రక్తసంబంధం.

 

ఆమె పేరు దీప జయకుమార్,  జయలలిత సోదరుడి కూతరు.

 

ఎపుడో జయలలితో కలసి ఉండిందట. జయ చనిపోయాక, పార్టీ పేరుతో,  రాజకీయాల పేరుతో జయలలిత ఆస్తులను,రాజకీయ వారసత్వాన్ని ఎవరెవరో తన్నుకు పోయేందుకు కుట్ర చేస్తున్నపుడు  దీప తన వాటా డిమాండ్ చేస్తూ ఉంది. వాటా హక్కు అంటున్నది.

 

 పోయస్ గార్డెన్ లోని జయలలిత నివాసం ‘ వేద నిలయం’ లో తనకు వాట ఉందంటున్నది.

 

ఎలాగంటే...

 

‘జయలలిత నివాసం పేరు వేద నిలయం. ఇది తన నాయనమ్మ వేదవల్లి పేరు నుంచి వచ్చింది.  ఇది వారసత్వం సంపద. కాబట్టి అత్త (జయకు) కు మిగిలిన కుటుంబ సభ్యులం  మేమే. కాబట్టి  నాకు వాటా ఉంది.’ అని అమె వాదిస్తున్నది.

 

‘చట్టం   ప్రకారం ఒక రి ఆస్తి  న్యాయంగా వారసులందరికి సమానంగా చెందుతుంది. చట్టం ప్రకారం మహిళలకు  కుటుంబ ఆస్తిలో సమాన హక్కులుంటాయి కాబట్టి నాకు జయ ఆస్తులలో వాటా ఉంది,’ అని ఆమె వాదిస్తున్నది.

 

ఆమెను రాజకీయాలలోకి తోసే, జయ లలిత నిజమయిన వారసురాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

 

అమె పేరుతో అక్కడక్కడా పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే వాటితోతనకు సంబంధం లేదంటున్నది దీప.

 

అయితే, తనకు మద్దతు తెలిపేందుకు కొంతమంది ప్రయత్నించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తను రాజకీయాల్లోకి  రానని ఆమె కచ్చితంగా చెప్పడం లేదు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !