
000
అనగా ఈ ప్రవీణ్ రెడ్డి. పాదరసంలా పాకుతూ ఉంటాడు టిఆర్ ఎస్ ప్రముఖులు పంక్షన్ ల కంతా. తెలంగాణా సెక్రెటేరియట్లో కనిపిస్తుంటాడు. బయట ఏలివారితో కలసి కూడా తిరగుతుంటాడు.అంతేకాదు, ఆయన గోల్డ్స్ స్టోన్ ప్రసాద్ కు కూడా సన్నిహితుడు. అన్ని వైపుల నుంచి ఉన్న ఈ అనుబధం మియాపూర్ నుంచివచ్చిందా, లేక మియాపూర్ దాకా పాకిందా అనే అనుమానం చాలా మందిలో కలుగుతూ ఉంది. ఈ వీడియో స్టోరీ దానికి సంబంధించిందే. ఒక టివి చానెల్ ఈ క్లిప్పింగ్ పోషల్ మీడియాలో ప్రవేశించింది. దీని ప్రకారం ఈ ప్రవీన్ రెడ్డి అల్లాటప్పా రెడ్డి కాదు.. కెసిఆర్,కేటీఆర్ ల అంతఃపురంలో కూడా కనిపిస్తాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కూడా చాలా సన్నిహితంగా మాట్లాడటం ఇక్కడ చూడవచ్చు. మరి పవర్ కి, భూ ‘స్వాహా’మికి, ప్రవీణ్ రెడ్డికి ఉన్న త్రిభుజ సంబంధం ఏమిటి?
(వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా సర్క్యేలేషన్ నుంచి వచ్చింది)