నేడు భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

First Published Jun 18, 2017, 10:29 AM IST
Highlights

ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో  వైకుంఠం కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  క్యూ బయటకు కూడా విస్తరించింది. దాదాపు  కిలోమీటర్‌ మేర బయట  భక్తులు వేచి ఉన్నారు. నిజానికి నిన్నటి నుంచే ఈ రద్దీ మొదలయింది.

ఈ రోజు ఆదివారం కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతూ ఉంది.

ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠం కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  క్యూ బయటకు కూడా విస్తరించింది. దాదాపు  కిలోమీటర్‌ మేర బయట  భక్తులు వేచి ఉన్నారు. నిజానికి నిన్నటి నుంచే ఈ రద్దీ మొదలయింది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు పడుతుంది. , ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు , కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం)స్వామివారిని 1,01,386 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

click me!