విశాఖ  జిరాక్స్ కంపెనీలో  500 ఉద్యోగాలు

First Published Aug 31, 2017, 5:57 PM IST
Highlights
  • త్వరలో 5వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ కంపెనీ యాజమాన్యం తెలిపింది.
  • విశాఖ పట్నంలోని ఓ జిరాక్స్ కంపెనీ యాజమాన్యంతో మంత్రి నారా లోకేష్.. ఈ రోజు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
  • ఆఫీస్ స్పేస్ వెంటనే కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు

నిరుద్యోగులకు శుభవార్త. విశాఖ పట్నంలోని ఓ జిరాక్స్ కంపెనీ 500మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం సహకరిస్తే.. త్వరలో 5వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ కంపెనీ యాజమాన్యం తెలిపింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖ పట్నంలోని ఓ జిరాక్స్ కంపెనీ యాజమాన్యంతో మంత్రి నారా లోకేష్.. ఈ రోజు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం భూమి కేటాయిస్తే..5 వేల మంది ఉద్యోగస్తులతో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ కంపెనీ ఈ సందర్భంగా మంత్రికి తెలియజేసింది.

5వేల ఉద్యోగాల్లో50 శాతం ఐ.టి ఉద్యోగాలు50 శాతం బిపిఓ ఉద్యోగాలు వస్తాయని వారు మంత్రికి వివరించారు.

దీనికి లోకేష్ స్పందించారు. రానున్న రెండేళ్లలో లక్ష ఐ. టి ,2 లక్షల ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు కల్పించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు .తక్షణమే 500 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభించాలని. అందుకు ఆఫీస్ స్పేస్ వెంటనే కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భూమి కేటాయింపులు పూర్తి అయ్యి సొంత భవనాలు నిర్మించడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందని.. అప్పటి వరకూ సమయం వృధా కాకుండా మధురవాడ ఐ. టి సెజ్ లో నిర్మాణం పూర్తి అవుతున్న మిల్లినియం టవర్స్ లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని లోకేష్ సూచించారు.

 

అనంతరం 500 మంది ఉద్యోగులతో జిరాక్స్ కంపెనీ మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభించడానికి విశాఖపట్నం లో అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్ ను కంపెనీ ప్రతినిధులకు ఐ టి శాఖ అధికారులు చూపించారు.విశాఖపట్నం నుండి జిరాక్స్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు. సచివాలయంలో ఐ. టి అడ్వైజర్ జెఏ చౌదరి,ఐ. టి సెక్రెటరీ విజయానంద్,సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు

click me!