తిరుమలలో గవర్నర్ దంపతుల దర్శనమిలా సాగింది

First Published Aug 31, 2017, 4:26 PM IST
Highlights

గురువారం నాడు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ స్వామిదర్శన భాగ్యం మహాద్భుతమన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పటికీ ” న భూతో న భవిష్యతి”, అని రాష్ట్ర గౌరవ గవర్నరు  ఈఎస్ ఎల్ నరసింహన్ ￰￰ఉధ్ఘటించారు.
గురువారం నాడు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ స్వామిదర్శన భాగ్యం మహాద్భుతమన్నారు.ప్రతి భక్తునికి దర్శనాన్ని కల్పించడంలో టీటీడీ అధికారులు నిరంతరం చేస్తున్న కృషిని అభినందించారు. స్వామివారి కృపతో అందరం ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలని ప్రార్థించానన్నారు.

అంతకు పూర్వం , ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి తరువాత వరాహస్వామిని దర్శించుకున్నారు.
అటు తరువాత శ్రీవారి ఆలయ మహాద్వారం చేరుకున్నారు.ఆలయం చెంత టీటీడీ ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , తిరుమల జీవో శ్రీ కే ఎస్ శ్రీనివాస రాజు, సీవి ఎస్ ఓ శ్రీ ఆకే రవికృష్ణ స్వాగతం పలికారు .

అర్చక స్వాములు ఇస్తికఫాల్ స్వగతం పలికారు. గవర్నరు దంపతులు స్వామివారిని దర్శించు కున్నారు.

అనంతరం శ్రీ వరదరాజ స్వామిని , వకుళమాతను , అంగద సుగ్రీవ అనంత విష్వక్సేన గరుడాళ్వారులను, ఆనందానిలాయంపై వెలసి ఉన్న హయగ్రీవ, నరసింహ , విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.అటు తరువాత సబేరా , భాష్యకారులవారి సన్నిధి , యోగనరసింహస్వామిని దర్శించుకున్నారు.
తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసారు.అనంతరం టీటీడీ ఈ ఓ, జేఈఓ లు స్వామివారి తీర్థ ప్రసాదాలను , చిత్రపటాన్ని , శేష వస్త్రాన్ని బహూకరించారు.

తిరుమలపెద్ద జీయర్ స్వామి , చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులలో ఒకరైన డా ఏ వి రమణ దీక్షితులు,ఉప కార్య నిర్వహణాధికారులు శ్రీ కోదండ రామ రావు , శ్రీ హరిద్రనాథ్ తదితర ఆధికారులు పాల్గొన్నారు.

click me!