
మహిళ నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో జనావాసాల మధ్య లిక్కర్ షాపులు ఏర్పాటుచేయడం మానుకోవడం లేదు. బహిరంగ సభలలో, సమీక్షా సమవేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లిక్కర్ షాపుల ఇళ్ల మధ్యఏర్పాటుచేయడం సహించమని చెబుతాడు. అయితే, బయట మాత్రమే షాపుల వస్తూనే ఉన్నాయి.తాజాగా
కృష్ణా జిల్లా మైలవరం చికెన్ షాపు ల సెంటర్ దగ్గర నివాసగృహాల మధ్యలో వైన్ షాపు ఏర్పాటుచేయడం మొదలు పెట్టారు. ఇది ఆ ప్రాంత మహిళలకు నచ్చడం లేదు. దీని వల్ల మహిళలలో అభద్రత పెరుగుతుందని వారి భయం. దీనికి నిరసనగా ఈ రోజు తిరగబడ్డారు. షాపు పనులు అడ్డగించారు. ఇద్దరు మహిళలు మౌనపోరాటం కూాడా ప్రారంభించారు.