బైకు ప్రమాదంలో తెలుగు నటుడు మృతి

Published : Jun 30, 2017, 08:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బైకు ప్రమాదంలో తెలుగు నటుడు మృతి

సారాంశం

జూనియర్‌ సినిమా హీరో కరంసింగ్‌(అస్లాం) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందాడు.  ఆయన వయసు 21 సంవత్సరాలు. వరంగర్ శివనగర్‌ కు ప్రాంతానికి చెందిన అస్లాం అనేక చిత్రాలలో నటించాడు. తెలంగాణా నుంచి హీరో గా ఎదురతున్న క్రమంలో ఆయన ఉన్నపుడు ఈ దుర్ఘటన జరిగడం మిత్రులను కలచివేస్తున్నది.

 

జూనియర్‌ సినిమా హీరో కరంసింగ్‌(అస్లాం) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందాడు.  ఆయన వయసు 21 సంవత్సరాలు. వరంగర్ శివనగర్‌ కు ప్రాంతానికి చెందిన అస్లాం అనేక చిత్రాలలో నటించాడు. తెలంగాణా నుంచి హీరో గా ఎదురతున్న క్రమంలో ఆయన ఉన్నపుడు ఈ దుర్ఘటన జరిగడం మిత్రులను కలచివేస్తున్నది. పేద కుటుంబం నుంచి వచ్చి సినిమా రంగంలో నిలదొక్కుకునే సమయంలో మృత్యువు అస్లాం ను  ఎత్తుకుపోయింది.

 

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా బీబీనగర్‌ వద్ద బైక్ డివైడర్‌కు ఢీ కొనడం ప్రమాదం జరిగింది. గాయాలతో ఆయన మృతిచెందినట్లు తెలిసింది. వచ్చే నెలలో విడుదల కానున్న  ‘ప్రేమమయం’ సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ ఆయన హైదరాబాద్ వచ్చాడు.

 

ఒక మిత్రుడి సహకారంతో సినిమా రంగానికి దగ్గిరయ్యాడు. ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. గత ఏడాది  ‘ప్రేమమయం’ సినిమా లో హోరోగా అవకాశం లభించింది.  ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల విడుదల కు ముస్తాబవుతూ ఉంది. రంజాన్‌ పండుగకు అస్లాం హైదరాబాద్‌ నుంచి శివనగర్‌లోని తన  ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కాజీపేటకు చెందిన తన బాల్యమిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై హైదారాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో హన్మకొండ–హైదరాబాద్‌ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్‌ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

 

మృతుని తల్లి ఫాతిమా, తండ్రి రూపేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన కరంసింగ్‌(అస్లాం) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu