విజయవాడ దొంగల్లో ఎమ్మే బిఇడి

First Published Jun 21, 2017, 4:24 PM IST
Highlights

విజయవాడ నగరంలో లో వివిధ నేరాలకు పాల్పడిన 19 మంది యువకులను పోలీసుల అరెస్టు చేశారు.అయితే వీరిలో ఒక పోస్టు గ్రాజుయేట్ కూడా ఉండటం విశేషం. ఎమ్మే చదవడమే కాకుండా ఎజుకేషన్ లో బ్యాచరల్ (బిఇడి) చేసిన చంద్రానాయక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.

విజయవాడ నగరంలో లో వివిధ నేరాలకు పాల్పడిన 19 మంది యువకులను పోలీసుల అరెస్టు చేశారు.అయితే వీరిలో ఒక పోస్టు గ్రాజుయేట్ కూడా ఉండటం విశేషం. ఎమ్మె చదవడమే కాకుండా ఎజుకేషన్ లో బ్యాచరల్ (బిఇడి) చేసిన చంద్రానాయక్ దొంగతనాలక పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ రోజు అరెస్టయివారంతా నగరంలో తాళాలు పగులగొట్టి, ఇళ్లలో షాపులలో దొంగతనాలు చేసే వారు. కొందరు చైన్ స్నాచర్స్ కూడా ఉన్నారు.  చంద్రా నాయక్ నుంచి  మూడు లక్షల రుపాయల విలువయిన వెండి వస్తువులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

సిపి కెమెరాల ఫుటేజి  పరిశీలించి పోలీసులు ప్రతికేసులో చాకచక్యంగా వ్యవహరించి నేరగాళ్లు పట్టుకున్నారు. నగర వాసుల వారివారి ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. 

ఈ రోజు దొరికిన 19 మంది వివరాలు

 

👉🏾 రాత్రి సమయంలో కెబుల్ ఆఫీస్ లో షటర్ తాళం పగలగొట్టిన కేసులో రాజేష్ అనే నిందుతుడు అరెస్ట్ ...2.50 లక్షల విలువగల స్పైజింగ్ మిషన్ స్వాధినం.

👉🏾రాత్రి సమయంలో ఇళ్ల తాళం పగలగొట్టి చోరికి పాల్పడుతున్న  ఏసుబాబు ,దుర్గారావు ఇద్దరు నిందితులు అరెస్ట్..
2 లక్షలు విలువగల చోరిసొత్తు స్వాధినం..

👉🏾 తెల్లవారుజామున వాకింగ్ చేసేవారి దగ్గర దోపిడికి పాల్పడుతున్న నరేంద్ర, శ్రీను ,లక్ష్మణరావు అనే ముగ్గురు నిందుతులు అరెస్ట్...
బంగారపు చైన్, 50వేల చోరి సొత్తు, హోండా యాక్టివా స్వాధినం..

👉🏾 బస్టాండ్ లో వెండి నగల బ్యాగ్  దొంగతనం చేసిన m a. Bed చదవిన చంద్రనాయక్ అరెస్ట్ ..3 లక్షల విలువగల వెండి స్వాధినం.

👉🏾 రాత్రి సమయంలో దారిదోపిడికి పాల్పడుతున్న సందీప్, సురేష్, కళ్యాణ్, ప్రసాద్ అనే నలుగురు నింధితులు అరెస్ట్...500రూ..చోరు సొత్తు ..ఓ ఆటో స్వాధీనం..


👉🏾 పగటిపూట దారిదోపిడికి పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలతో సహా ఒక యువతి, యువకుడు అరెస్ట్ ...800 రూ. చోరి సొత్తు స్వాదినం..

👉🏾 మోటర్ బైక్ లు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు జువైనల్స్ అరెస్ట్...
రెండు బైక్ లు, 72 గ్రా.. బంగారం స్వాధీనం.

👉🏾 మోటర్ వాహనాల చోరీలకు పాల్పడుతున్న హనుంతరావు అనే నిందితుడు అరెస్ట్... 10 మోటర్ సైకిళ్లు స్వాధినం.

👉🏾 అన్న కొడుకు రంగారావు పై హత్యాయత్నానికి ప్రయత్నించిన బాబాయి పేరు జమలయ్య తో 7 గురు అరెస్ట్...
ఆస్తి తగాదాల నేపద్యంలో హత్యయత్నానికి ప్రయత్నం. చంపడానికి అడ్వాన్స్, పూర్తయ్య లక్ష కు పాత రౌడి షీటర్ మేడా సురేష్ తో మాట్లాడిన జమలయ్య..



సిటీలో నైట్ సర్వలెన్స్ నడుస్తూనే ఉంది...పోలీసులంతా రాత్రి వేళల్లో పహారా కాస్తూనే ఉన్నామని నగర పోలీసుల చెప్పారు.

click me!