కాంగ్రెస్ వింత: హైదరాబాద్ పార్టీ మీటింగ్ లో కిశోర్ చంద్ర దేవ్

First Published Jun 21, 2017, 1:57 PM IST
Highlights

ఎపుడూ ఎక్కడా పార్టీ సమావేశాలలో కనిపించని మాజీ  కేంద్ర మంత్రి కిశోర చంద్రదేవ్ ఈ రోజు హైదరాబాద్ లోజరిగిన ఒక చిన్న సమావేశానికి హాజరయి అందరిని ఆశ్చర్య పరిచారు.ఇదొక వింతగా చెబుతున్నారు.

కిశోర్ చంద్రదేవ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. యుపిఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి గా ఉండేవారు.2014 ఎన్నికలలో ఓడిపోయిన నాయకుడు. నిఖార్సయిన నాయకుడని ఆయనకు పేరు. నిజాయితీ పరుడని గుర్తింపు. అన్నింటికంటే ముఖ్యంగా టెన్ జనపథ్ కు సన్నిహితడని చెప్పుకుంటారు.

 

ఆయన గురించి చెప్పుకోవలసి అతి ముఖ్యమయినవిషయం-ఆయన ఎపుడే  కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో కనిపించరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారలంలోఉన్నపుడు ఒక్క సారి కూడా పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు రాని నాయకుడాయన. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎల్ బి స్టేడియం లో ఏర్పాటుచేసిన పార్టీ భారీ కార్యక్ర మాలలో ఒక్క సారి కూడా ఆయన కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు ఇంత దూరంగా ఉండే నాయకుడాయన ఒక్కరే.  అయిదు సార్లు లోక్ సభ, ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రచార రాజకీయాలకు, ముఠా రాజకీయాలకు ఆయన దూరంగా ఉండేవారు. ఆయన తెలిసిన దారి ఒక్కటే, ఢిల్లీ టు విజయనగరం.

 

అయితే, జూన్  21, 2017న ఒక వింత జరిగింది. ఇది హైదరాబాద్ రాజధానిలో. సికింద్రాబాద్ బోయిన్ పల్లి లోని రాజరాజేశ్వరీ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ ఎస్సీ , ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల నేతల  కార్యకర్తల సమావేశానికి కిశోర్ చంద్రదేశ్ హాజరయ్యారు.ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. ఎస్సీ , ఎస్టీ రిజర్వుడ్ నియోజకవరగాల్లో పార్టీని బలోపేతంచేయడం గురించి చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ రూపకల్పన కోసం  ఈ సమావేశం ఏర్పాటుచేశారు.

 

దీనికి రావడమే కాదు, వచ్చి మాట్లాడారు. ఏమ్మాట్లాడారంటే...

 

రిజర్వేషన్లు లేని స్థానంలో కూడ ఎక్కవ మంది ఎస్సీ ,ఎస్టి లు ఉన్నారు... సామర్థ్యం ఉన్న వాళ్లు రిజర్వేన్ లేని స్థానాల్లో కూడ గెలిచారు....సామర్థ్యం ఉంటె రిజర్వేషన్ లేని స్థానంలో కూడా టికెట్ ఇప్పించడానికి నేను సహకారం చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు.

 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన  ‘నిర్మల్ భారత్’ ను బీజేపీ కాపీకొట్టి ‘స్వచ్ఛ భారత్’ బిజెపి అంటున్నదని అంటున్నది. కాంగ్రెస్ పోగ్రామ్స్ నే పేరు మరిచి ఇప్పటి ఎన్ డిఎ  ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని అన్నారు.

 

click me!