విజయవాడ బంగారం దోపిడీ దొంగలు దొరికారు

First Published Jul 24, 2017, 3:26 PM IST
Highlights
  • కేసును చాకచక్యంగా చేధించిన పోలీసులు
  • 4.25కేజీల బంగారం స్వాధీనం
  • నిందితులకు గతంలోనూ నేరచరిత్ర

కొద్ది రోజుల క్రితం విజయవాడ బీసెంట్ రోడ్డులో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు చేధించారు. పోలీసులు 16 బృందాలుగా ఏర్పడి దోపిడీ దొంగలను పట్టుకోగలిగినారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఈరోజు తెలియజేశారు. ఈ కేసును తాము సవాలుగా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దొంగతం జరిందన్న విషయం తెలియగానే తామంతా అప్రమత్తమైనట్లు తెలిపారు. ముంబయి, బెంగళూరు, కలకత్తా, చెన్నై, పూనెలలో గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

 

ఈ దొంగతనానికి పాల్పడిన దోపిడీ దొంగలందరికీ గతంలో నేర చరిత్ర ఉందని ఆయన అన్నారు. బంగారు దుకాణంలో పనిచేసే మానేసిమ అనే వ్యక్తే ఈ ఘటనకు అసలు సూత్రధారి అని తెలిపారు. ఈనెల 10వ తేదీనే దొంగతం చేయడానికి ప్రణాళిక చేశారని.. కానీ కుదరక తర్వాత ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ కేసును చేధించామని.. సీఎం చంద్రబాబు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిరోజు పూర్తి వివరాలు తీసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. దోపిడీకి పాల్పడిన ఏడుగురు నిందితులను పట్టుకున్నామని.. వారి వద్ద నుంచి 4.25కేజీల బంగారం, ఒక రివాల్వర్,5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

click me!