4జీ జియో ఫోన్ కావాలా... అయితే ఇలా బుక్‌ చేసుకొండి

Published : Jul 24, 2017, 02:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
4జీ జియో ఫోన్ కావాలా... అయితే ఇలా బుక్‌ చేసుకొండి

సారాంశం

ఫ్రీ బుకింగ్స్ ఆగష్టు 24 న ప్రారంభం. సెప్టెంబర్ లో కస్టమర్లకు అందిస్తారు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతి.

జియో 4జీ ఫోన్ ప్ర‌క‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ ఫోన్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు కొనుగోలు ఎలా చేయ్యాలి అనే సందిగ్థ‌త చాలా మందిలో ఉంది. జియో 4G ఫోన్ సెప్టెంబరులో ప్రారంభించబడుతుంది, మీకు జియో ఫోన్ కావాలంటే ఇలా బుక్ బుక్ చేసుకోండి.


ఫోన్ సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఫోన్‌ వస్తుంది, కానీ ఆగస్టు 24 నుంచి ముందే ఫ్రీ బుకింగ్ ఆప్ష‌న్ అందుబాటులో ఉంటుంది. 

రిలయన్స్ జీయోఫోన్ కోసం ముందుగా బుకింగ్ కావాలంటే మై జియో యాప్ నుండి లేదంటే జియో స్టోర్ల నేరుగా బుక్ చేసుకునే సౌక‌ర్యం పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు జియో ఫోన్ బుకింగ్ ఆప్ష‌న్ రాలేదు ఆగ‌ష్టు నేల 24 వ తేదీ నుండి మీ జియో యాప్ లో క‌నిపిస్తుంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జియో యూజర్లు మాత్ర‌మే రిలయన్స్ Jio వెబ్సైట్లో వెళ్లాలి,  వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్, చిరునామా మరియు ఇమెయిల్ చిరునామాగా ఉండే వ్యక్తిగత వివరాలను వినియోగదారులు పూరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు బుక్ జియో ఫోన్ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. ఆ బ‌ట‌న్ ను క్లిక్ చేసిన త‌రువాత 1500 రూపాయ‌లు పెమేంట్ వ‌స్తుంది. డ‌బ్బుల క‌ట్టిన త‌రువాత మీరు రిజిస్ట‌ర్ చేసిన ఫోన్ నంబ‌ర్‌కి బుక్ అయిన‌ట్లు ఒక స‌మాచారం వ‌స్తుంది. దీంతో మీ ఫోన్ బుక్ అయినట్లే.

 1500 రూపాయ‌లు 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇస్తారు. ఎలా ఇస్తారు అనేది ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక స‌మాచారం లేదు.
 
జియో ఫోన్ డెలివ‌రీ లో ఫ‌స్ట్ కం ఫ‌స్ట్ స‌ర్వ ప‌ద్ద‌తిని పాటిస్తారు.
 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu