
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుగును ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలకు ప్రశంసలందుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు నుంచి తొలి అభినందనలు అందాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతూ వెంకయ్య ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.