ఉపరాష్ట్రపతి చెప్పులు కొట్టేసారు..!

Published : Jan 20, 2018, 11:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఉపరాష్ట్రపతి చెప్పులు కొట్టేసారు..!

సారాంశం

బెంగళూరు పర్యటనకు వెళ్లిన ఉపరాష్ట్రపతి బీజేపీ ఎంపీ  పీసీ మోహన్ ఇంటికి అల్పాహారం చేసేందుకు వెళ్లిన వెంకయ్య

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పులు  గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. శుక్రవారం వెంకయ్యనాయుడు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఆయనను అల్పాహారం స్వీకరించేందుకు వారింటికి ఆహ్వానించారు. ఎంపీ ఆహ్వానం మేర అక్కడికి వెళ్లిన వెంకయ్యను కలిసేందుకు అభిమానులు, పార్టీ నేతలు క్యూలు కట్టారు. వారందరితోనూ వెంకయ్య సమావేశం అయ్యారు.  సమావేశం అనంతరం బయటకు వచ్చి చూడగా.. ఆయన చెప్పులు కనపడలేదు. దీంతో.. ఆయన కాళ్లకు చెప్పులు లేకుండానే వెళ్లాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో జనం గుమిగూడిన నేపథ్యంలో ఇతరనేతలు ఎవరన్నా వెంకయ్య పాదరక్షలు పొరపాటున వేసుకుని ఉంటారని భద్రతాసిబ్బంది భావించారు. ఆ సమయంలో వెంకయ్యనాయుడు వెంట కేంద్రమంత్రి సదానందగౌడ, బీజేపీ ఎమ్మెల్యేలు రవి, జగదీశ్ శెట్టర్ తదితరులు ఉన్నారు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !