20 జనవరి 2018 శనివారం మీ రాశి ఫలాలు

Published : Jan 20, 2018, 08:39 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
20 జనవరి 2018 శనివారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం: ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అనుకోని లాభం రావటం కానీ, అనుకోని వ్యక్తులను కలవటం కానీ జరుగుతుంది. వినోదయాత్ర చేస్తారు.

వృషభం

వృషభం : ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కాని అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

మిథునం

మిథునం : ఈ రోజు మీ చిన్ననాటి మితులను కానీ, దూర దేశం లో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలుంటాయి. పెట్టుబడులకు అనుకూల దినం.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జో క్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. వివాదాలకు దూరంగా ఉండండి.

సింహం

సింహం : స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి.

కన్య

కన్య : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవస రం. అత్యుత్సాహానికి పొకండి.

తుల

తుల : మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతో గడుపుతారు.

వృశ్చికం

వృశ్చికం : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయ టి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

ధనుస్సు

ధనుస్సు : మీ అజాగ్రత్త, అనాలోచిత పవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమ స్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది. చెప్పు డు మాటలు విని ఆవేశానికి లోనవకండి.

కుంభం

కుంభం : స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయం.మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu