వీరు మ‌ళ్లీ బ్యాట్ ప‌డుతున్నాడు

Published : Aug 23, 2017, 06:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
వీరు మ‌ళ్లీ బ్యాట్ ప‌డుతున్నాడు

సారాంశం

మళ్లీ బరిలోకి దిగనున్న సెహ్వాగ్. టెన్ పీ ఎల్ సీజన్ 2 లో అలరించనున్న వీరు.

భార‌త మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్యాగ్ బ్యాటింగ్ మిస్ అవుతున్నారా... అయితే మీకు ఓ గుడ్ న్యూస్ వీరు మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌బోతున్నాడు. అంటే మ‌ళ్లీ భార‌త జ‌ట్టులో, లేకుంటే ఐపీఎల్ లోకి వ‌స్తున్నాడా..? అని అనుమానం క‌ల్గుతుంది క‌దా.. అదేం లేదండి. మ‌రి ఎలా అనుకుంటున్నారు క‌దా..!

ఈ ఎడాది డిసెంబర్ 21 నుంచి 24 మధ్య యూఏఈలోని షార్జాలో టెన్‌పీఎల్ సీజ‌న్ -2 లీగ్ జరగనుంది. ఈ టోర్నీలో సెహ్వాగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. సెహ్వాగ్ ఒక్క‌డే కాదు ఈ టెన్‌పీఎల్ లో విద్వంస‌క‌ర ఆట‌గాళ్లు అఫ్రిదీ, క్రిస్ గేల్, సంగక్కర తదితర ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.

 మొత్తం 20 జ‌ట్లు ఈ రెండ‌వ సీజ‌న్ లో పాల్గోన‌బోతున్నాయి. భార‌త‌దేశం నుండి మరాఠాస్, పంజాబీస్, కేరళిటీస్ మూడు జ‌ట్లు పాల్గోంటున్నాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా  బంగ్లాస్, లంకన్స్, సింధీస్, ఫఖ్తూన్స్  పాటు ప‌లు జ‌ట్లు  ఈ టోర్నీలో ఆడనున్నాయి. టీ20 తరహాలోనే టెన్‌పీఎల్ మ్యాచులు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !