రాజీనామా చేయాలనుకుంటున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు

Published : Aug 23, 2017, 05:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
రాజీనామా చేయాలనుకుంటున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు

సారాంశం

రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనుకున్న సురేశ్ ప్రభు వారించిన ప్రధాని నరేంద్రమోది

 

కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభురాజీనామా చేయాలనుకుంటున్నార. ఇటీవల రైలు ప్రమాదాలు తీవ్రం కావడం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడమో,గాయపడటంతో  నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. యుపిలో నాల్గు రోజుల వ్యవధిలో రెండు రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు కైఫియత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడం తో చాలా మంది గాయపడ్డారు.  నాలుగురోజుల కిందట   ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఉత్క‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంలో 23 మంది మృత్యువాతపడగా, 60 మందికి పైగా గాయపడ్డారు. దీనితో రైల్వే నిర్వహణ బాగా విమర్శలకు కారణమయింది.

 

 

దీనితో క‌ల‌త చెందిన రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భు బుధవారం ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీని క‌లసి రాజీనామా  చేయాలన్న తన మనోభావం తెలియచేశారు. అయితే ప్రధాని మాత్రం వేచి చూడాల‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

 

 

Read more news at  Asianet-Telugu Express News

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !