ఇంకా అడ్డుగోలు సమర్ధనలేనా

Published : Jan 02, 2017, 07:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఇంకా అడ్డుగోలు సమర్ధనలేనా

సారాంశం

ప్రజాగ్రహం బయటపడుతుందోనన్న భయంతో వెంకయ్య భజనబృందం  ప్రధానమంత్రిని సమర్ధించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నది.

మోడి భగవంతుడి దూత.. ప్రధానమంత్రి దేశోద్ధారకుడు...మోడి ప్రధాని కావటం దేశప్రజలు చేసుకున్న అదృష్టం...ఇవి డిసెంబర్ 31 తర్వాత మోడి విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సమర్ధనలు. ఎక్కడ ప్రజాగ్రహం బయటపడుతుందోనన్న భయంతో వెంకయ్య భజనబృందం  ప్రధానమంత్రిని సమర్ధించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నది.

 

పెద్ద నోట్లు రద్దైన 50 రోజుల తర్వాత దేశంలో ఎటువంటి అద్భుతమూ జరగలేదు. దాంతో మోడి గురించి కానీ, పెద్ద నోట్ల రద్దు సాధించిన ఘనత గురించి కానీ చెప్పుకోవటానికి కమలనాధులకు ఏమిలేదు. దాంతో ప్రజాగ్రహాన్ని మోడి మీద నుండి మళ్లించేందుకు తమ అడ్డుగోలు సమర్ధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

 

పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో 50 రోజుల తర్వాత అద్భుతం చూస్తారని చెప్పిన మోడి ఇపుడు ప్రజలకు మొహం చాటేసారు.

 

నల్లధనం నియంత్రణ, ఉగ్రవాదులకు ఊతం, నకిలీ నోట్ల చెలామణి కారణాలుగా పెద్ద నోట్లను మోడి నవంబర్ 8వ తేదీన రద్దు చేసారు. అయితే, నోట్ల రద్దు తర్వాత మోడి చెప్పిన పై కారణాల్లో ఏవి కూడా సరైనవి కావని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే, దేశంలో నల్లధనం మోడి చెప్పినట్లు లేదు.

 

నోట్ల రద్దు తర్వాత దేశంలో చెలామణిలో ఉన్న డబ్బంతా తిరిగి బ్యాంకులకు వచ్చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయడు స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకూ పట్టుబడిన నల్లధనం కేవలం రూ. 4 వేల కొట్లేనని ఐటి శాఖే ప్రకటించింది.

 

ఇకపోతే, దేశంలో నల్లధనం ఎంతుందో తమ వద్ద లెక్కలు లేవని స్వయంగా  అరుణ్ జైట్లీనే  పార్లమెంట్ లో చెప్పారు. అంటే, పెద్ద నోట్ల రద్దుకు నల్లధనం అనే ముసుగును వాడుకున్నారు.

 

‘ఇంత తక్కువ కాలంలో బ్యాంకులకు అంత డబ్బు ఎప్పుడూ వెనక్కు తిరిగి రాలేద’ని వెంకయ్య చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. తలపై తుపాకి పెట్టి డబ్బు ఇస్తావా? ఛస్తావా? అని దోపిడి దొంగలు బెదిరిస్తే ఎవరైనా ఏమి చేస్తారు? కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. అయినా వెంకయ్య లాంటి భజనపరులు మోడిని సమర్ధించకుండా ఇంకేమి చేస్తారు లేండి?

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !