లవర్ లేనివాళ్లు లవర్స్ డే ఇలా జరుపుకోవచ్చు

First Published Feb 14, 2018, 12:13 PM IST
Highlights
  • లవర్స్ ఉన్నవారి సంగతి సరే.. ఎలాగైనా ఎంజాయ్ చేస్తారు. మరి లవర్స్ లేని వారి పరిస్థితి ఏంటి..? కొంత మందికి అసలు లవర్స్ లేకపోవచ్చు. మరి కొందరు బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. మరి అలాంటి వాళ్లు వాలంటైన్స్ డే జరుపుకోకూడదా..?

వాలంటైన్స్ డే.. ఫిబ్రవరి 14వ తేదీ అనేది ఇప్పటి జనరేషన్ ప్రేమికులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. అమ్మానాన్నలు, అక్క చెల్లెళ్ల బర్త్ డేలకు అయినా విష్ చేయకుండా ఉంటారేమో కాని… వాలెంటయిన్స్ డే నాడు ప్రియురాలిని విష్ చేయకుండా, కాస్ట్ లీ గిఫ్ట్ తో ఇంప్రెస్ చేయకుండా మాత్రం ఉండలేరు. లవర్స్ ఉన్నవారి సంగతి సరే.. ఎలాగైనా ఎంజాయ్ చేస్తారు. మరి లవర్స్ లేని వారి పరిస్థితి ఏంటి..? కొంత మందికి అసలు లవర్స్ లేకపోవచ్చు. మరి కొందరు బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. మరి అలాంటి వాళ్లు వాలంటైన్స్ డే జరుపుకోకూడదా..? ఎందుకు జరుపుకోకూడదు. ఆనందంగా జరుపుకోవచ్చు. ఎలానో తెలుసుకోవాలనుందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

1.సింగిల్ గా వాలంటైన్స్ డే జరుపుకోవాలనుకునే వాళ్లు ముందుగా చేయాల్సింది.. సోషల్ మీడియాకి దూరంగా ఉండటం. ఎందుకంటే.. మీ ఫ్రెండ్స్ వారివారి లవర్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సహజం. వాటిని చూసి అయ్యో.. నాకు లవర్ లేదే అని మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ ఒక్క రోజు దానికి కాస్త దూరంగా ఉండటం మంచిది.

2. లేదు.. సోషల్ మీడియా వాడకుండా ఒకరోజంతా ఉండటం మా వాళ్ల కాదు అనుకునే వాళ్లు ఈ పనిచేస్తే సరిపోతుంది. ఏంటంటే.. లవర్స్ ఉన్న మీ ఫ్రెండ్స్, మాజీ లవర్స్ సోషల్ మీడియా ఎకౌంట్స్ ని బ్లాక్ చేయండి. అప్పుడు వారి పోస్టులు మీకు కనిపించవు.

3.మీరు సింగిల్ గా ఉన్నాము అనే బాధపడకుండా ఉండేందుకు మరో మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన రెస్టారెంట్ కి వెళ్లి.. నచ్చిన ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంతగా.. ఇంకెవరూ ప్రేమించలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

4.మీలాగే.. సింగిల్ గా లేదా బ్రేకప్ అయిన మిగితా స్నేహితుల జాబితా తయారు చేయండి. మీరంతా కలిసి ఏదైనా ట్రిప్ వేయండి. సరదాగా గడిపేయండి.

5. ఈ రోజు ప్రేమికులంతా.. వారి లవర్స్ తో సినిమాలకో, షికార్లకో వెళ్లడం సహజం. అంతెందుకు ఏ టీవీ ఛానెల్ పెట్టినా.. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు.. ఏదైనా హర్రర్ మూవీస్ చూడండి. అప్పుడు మీకు అలాంటి ఆలోచనలే రావు.

6. ఇవన్నీ కాదు అనుకుంటే.. చక్కగా బ్యూటీ పార్లర్ కి వెళ్లండి. అక్కడ కొన్ని గంటల సమయాన్ని గడిపి.. మీ అందాన్ని మరింత మెరుగుపరుచుకోండి.

click me!