ఫిబ్రవరి 14 బుధవారం 2018..మీ రాశి ఫలాలు

Published : Feb 14, 2018, 08:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఫిబ్రవరి 14 బుధవారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఆర్థికంగా, పెట్టుబడులకు అనుకూల దినం.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలం. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులుసంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ప్రయాణాల మధ్యలో ఆపవలసి రావటం, అడ్డంకులు ఎదురవటం జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యులకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు , వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం , ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా సామాన్యం. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే పనులు చేయగలుగుతారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశం. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశం. దూర ప్రయాణాల విషయంలో అనుకూలం. పెట్టుబడులకు అనుకూలం కాదు.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయటం చేస్తారు. మీ సహుద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu