భూములన్నీఆంధ్రోళ్లు దోచుకున్నారన్నావ్... ఇపుడేం చేస్తున్నవ్?

First Published Jun 14, 2017, 2:33 PM IST
Highlights

మియాపూర్ భూముల కుంభకోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబమంతా కూరుకుపోయి ఉంది.గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో ఆయనకు సంబంధాలున్నాయి.సీఎం కూతురు కవిత భూ సమీక్షలో ఎలా పాల్గొంటారు? కూకట్ పల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కవితకు  భూములు రిజిష్ట్రేషన్  చేసింది నిజం కాదా?

ఆరోజుల్లో తెలంగాణ భూములను ఆంద్ర పాలకులు దోచుకుంటున్నారన్నవ్, మరీ ఇపుడు జరగుతున్నదేమిటో ముఖ్యమంత్రి  కెసిఆర్ ప్రజలకు చెప్పాలని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఆస్తులకు కేసీఆర్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, ఈ ఆస్తులను కాపాడాలని అధికారమిస్తే కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మియాపూర్ భూములను  స్కామ్ ను బయటపెట్టింది  ప్రభుత్వం అని ఒక వైపు చెబుతూ మరొక వైపు  ఇప్పుడు ఏమిజరగలేదనడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు సహచర కాంగ్రెస్ నాయకులతో కలసి ఆయన  మియాపూర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత  జానారెడ్డి , కౌన్సిల్ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ , సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, V. హనుమంతరావు , సబితమ్మ, గడ్డం ప్రసాద్ కుమార్ , సుధీర్ రెడ్డి, కెఎల్ ఆర్, భిక్షపతి యాదవ్ ,రవి కుమార్ యాదవ్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్యామ మల్లేష్ , టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి  ,రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మరియు జిల్లా నేతలు పాల్గొన్నారు.

 

 

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు-

 

*కేసీఆర్, ఫ్యామిలి, టీఆరెస్  నేతలు ఈ మియాపూర్ భూముల ఆక్రమణల వెనక ఉన్నారు.

*మియాపూర్ స్కామ్ లో సీఎం సన్నిహితుడు దామోదర రావు ఉన్నారు.

*గోల్డ్ స్టోన్ ప్రసాద్   మెర్సిడెస్ బెంజ్ కారు ఇచ్చింది నిజం.

*కేసీఆర్ కుటుంబం ఈ కుంభకోణంలో హస్తం ఉంది.

*సీఎం కూతురు కవిత్త కు భూ సమీక్షలో ఎలా పాల్గొంటారు?

*కూకట్ పల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కవితకు  భూములు రిజిష్ట్రేషన్  చేసింది నిజం కాదా..?

*కూకట్ పల్లి లో  సీఎం కుటుంబ సభ్యుల పేరుతో 4 ఎకరాలు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు...


*ఈ స్కామ్ లో సీఎం, ఫ్యామిలీ, మంత్రులు, ఐఏఎస్ లు ,అధికారులు అందరు అందిన కాడికి దోచుకున్నారు.

*భూముల పై ఎస్కె సిన్హా రిపోర్టు ను బయట పెట్టాలి.

*సీఎం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణను జరిపించాలి.

*ఈ భూములలో కనీసం ప్రభుత్వ బోర్డు లు ఎందుకు పెట్టలేదు.

click me!